వైసీపీ మరో మాజీ మంత్రి రాజీనామా.. సైకిల్ ఎక్కడానికేనా..!

వైసీపీకి మళ్ళీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలంగా రాజీనామా బాట పడుతున్నారు. ఎన్నికల ముందు జోరుగా సాగిన వలసలు ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి.

Update: 2024-08-10 10:58 GMT

వైసీపీకి మళ్ళీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలంగా రాజీనామా బాట పడుతున్నారు. ఎన్నికల ముందు జోరుగా సాగిన వలసలు ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామాతో మొదలైన రాజీనామాలు.. మాజీ మంత్రుల వరకు చేరాయి. ఆళ్ళ నాని రాజీనామా షాక్ నుంచి తేరుకోకముందే తాజాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా వైసీపీకి టాటా చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారాయన. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అందించారు. కానీ వైసీపీ విధానాలతో అసంతృప్తికి గురయ్యే ఆయన పార్టీ వీడుతున్నారని వాదన వినిపిస్తోంది.

అందుకే రాజీనామానా..

శిద్దా రాఘవరెడ్డి.. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పలుసార్లు గెలిచారు. టీడీపీ పార్టీ తరపు 2019 ఎన్నికల్లో దర్శికి ప్రాతినిధ్యం వహించిన ఆయనను ఓటమి పలకరించింది. ఆ తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే ఎన్నికల బరిలో నిలబడాలని ఆయన భావించారు. కానీ వైసీపీ అధిష్టానం ఆయనకు ఆ అవకాశం కల్పించలేదు. టికెట్ లభించకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారని, దానికి తోడు తనకు పార్టీలో విలువ, ప్రాధాన్యత కరువు కావడంతోనే పార్టీ వీడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరుల నుంచి అందుతున్న సమాచారం.

టీడీపీలోకి రీఎంట్రీ

వైసీపీకి రాజీనామా చేసిన శిద్దా రాఘవరావు.. మళ్ళీ టీడీపీ గూటికి చేరాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హాయంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఉన్న పరిచయాలతో ఇప్పుడు చంద్రబాబుతో మంతనాలు జరపాలని శిద్దా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే అన్ని దారుల నుంచి చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారని, కానీ చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమచారం. అంతేకాకుండా శిద్దా చేస్తున్న పైరవీలన్నీ కూడా ఇతర జిల్లాలకు చెందిన నేతలతోనే కావడంతో టీడీపీలోకి శిద్దా రీఎంట్రీ కుదరనట్లే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ కీలక నేత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కలవాలని శిద్దా కోరారని తెలుస్తోంది.

శిద్దా రాజకీయ ప్రస్థానం

శిద్దా రాఘవరావు.. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 2004 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆయన ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో మాత్రం దర్శి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తొలి విజయం కూడా అదే. శిద్దా రాఘవరావు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ టీడీపీ మాత్రం ఆయనకు కీలక బాధ్యతలు అందించింది. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఆయన దర్శి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అప్పటి రాజీకయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనను ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి నిలబెట్టింది టీడీపీ. అందులో ఓటమిపాలవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా దర్శి నుంచి పోటీ చేయాలి భావించిన వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు.

ఎన్నికలకు ముందే రాజీనామా ప్లాన్..

అయితే టికెట్ లభించకపోవడంతో ఎన్నికల ముందే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో అప్పటికే ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి శిద్దాతో మాట్లాడారు. నయానో.. భయానో మాట్లాడి ఒప్పించి వైసీపీ అధినేత జగన్ దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆయన పార్టీలోనే కొనసాగాలని జగన్ గట్టిగా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో శిద్దా రాఘవరావు.. వైసీపీలోనే కొనసాగారు. ఇప్పుడు అవకాశం దొరకడంతో వైసీపీకి రాజీనామా చేశారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గతంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. శిద్దా రాఘవరావు వ్యాపారాలను టార్గెట్ చేసి వాటన్నింటిని స్తంభింపజేయడంతో ఆయన టీడీపీని వదిలి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Tags:    

Similar News