ఆ 15వేల కోట్ల వినియోగానికి ప్రభుత్వం ఉత్తర్వులు
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.
By : The Federal
Update: 2024-11-10 14:04 GMT
అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 15వేల కోట్ల వినియోగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు ద్వారా ఈ రూ. 15వేల కోట్లు ఏపీకి అందించేందుకు కేంద్రం గతంలో అంగీకారం తెలిపింది. అమరావతి డెవలప్‌మెంట్‌కు సీఆర్‌డిఏ పంపిన మరో ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అయితే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ కాని ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో రూ. 6,750 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది.
సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. వరల్డ్ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి నిధులు రిసీవ్ చేసుకునేందుకు సీఆర్‌డిఏ కమిషనర్‌కు అధికారులను కల్పించింది. ఆ మేరకు ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము పేర్కొన్నారు.