ప్రజల ఫోన్లకే అలెర్ట్స్.. విశాఖలో సైక్లోన్ కంట్రోల్ రూమ్స్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ సర్కార్ మరోసారి అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సైతం అలెర్ట్ అయ్యారు.

Update: 2024-09-08 14:08 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ సర్కార్ మరోసారి అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సైతం అలెర్ట్ అయ్యారు. అధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మరోపారి వర్షాలు పడనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. వర్షం పడే అవకాశం ఉందంటూ ఐఎండీ చెప్పిన జిల్లాల్లోని వర్షపాత శాతాన్ని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్దతను కలెక్టర్లు కూడా సీఎం చంద్రబాబుకు వివరించారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్న క్రమంలో ఉత్తరాంధ్రలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈసారి వరదలు వస్తే మాత్రం ఒక్క ప్రాణం కూడా పోడానికి వీల్లేదని అననారు. అదే విధంగా ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉన్న కారణంగా ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, ప్రాజెక్ట్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని ప్రాజెక్టుుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉండే ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు సరఫరా చేయాలని, వరద పరిస్థితులను గమనించడానికి డ్రోన్లను వినియోగించుకోవాలని చెప్పారు.

ఇప్పటికే చేపట్టిన చర్యలు

దాదాపు 2 వేల మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించామని, వారికి ఆహారం, తాగునీరు వంటి వసతులు కూడా కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వివరించారు. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలున్నాయని, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. దానికి అనుగుణంగానే బ్రిడ్జిలపై రాకపోకలను నియంత్రిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నామని తెలిపారు. కాగా వర్షాలు, వరదలకు సంబంధించిన సమాచారన్ని ప్రజల ఫోన్లకు వాట్సాప్, ఫేస్‌బుక్, మెసేజ్‌ల రూపంలో అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉన్నందున అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ అన్ని అవసరాలను తీర్చేలా చూసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.

విశాఖలో సైక్లోన్ కంట్రోల్ రూమ్స్

ఈ నేపథ్యంలోనే విశాఖలో సైక్లోన్ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. విశాఖలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ కలెక్టరేట్, పోలీస్ కంట్రోల్ రూమ్2లతో పాటు తహశీల్దార్ కార్యాలయాల్లో 24/7 పనిచేసేలా ఈ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కంట్రోల్ రూమ్‌ల నెంర్లను కూడా ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

విశాఖపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891-2590102, 0891-2590100,

పోలీసు కంట్రోల్‌ రూం0891-2565454, డైల్‌ – 100, డైల్‌ – 112,

ఆనందపురం తహశీల్దార్‌ కార్యాలయం 9700501860,

భీమిలి తహశీల్దార్‌ కార్యాలయం 9703888838,

పద్మనాభం తహశీల్దార్‌ కార్యాలయం 7569340226,

చినగదిలి తహశీల్దార్‌ కార్యాలయం 9703124082,

పెందుర్తి తహశీల్దార్‌ కార్యాలయం 7702577311,

సీతమ్మధార తహశీల్దార్‌ కార్యాలయం, మహారాణిపేట తహశీల్దార్‌ కార్యాలయం 9182807140,

గోపాలపట్నం 7842717183

తహశీల్దార్‌ కార్యాలయం, ములగాడ తహసిల్దార్‌ కార్యాలయం 9440552007,

గాజువాక తహసిల్దార్‌ కార్యాలయం 8886471113 ,

పెదగంట్యాడ తహసిల్దార్‌ కార్యాలయం 9948821997

విశాఖలో వర్షపాతం ఇలా..

గడిచిన 24 గంటల్లో విశాఖ నగరం సగటున 60.7 మిల్లీమీటర్ల చొప్పున 668.2 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. అత్యధికంగా భీమిలిలో 87.0 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదయింది. 42.08 మిల్లీమీటర్లతో పెందుర్తిలో అత్యల్ప వర్షపాతం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మహారాణిపేట 74.4 మిల్లీమీటర్ల, సీతమ్మధార 72.6 మిల్లీమీటర్ల, ఆనందపురం 68.8 మిల్లీమీటర్లు, విశాఖపట్నం రూరల్‌ 66.4 మిల్లీమీటర్లు, పెదగంట్యాడ 55.8 మిల్లీమీటర్లు, పద్మనాభం 53.6 మిల్లీమీటర్లు, గోపాలపట్నం 52.4 మిల్లీమీటర్లు, ములగాడ 48.6 మిల్లీమీటర్లు, గాజువాక 45.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Tags:    

Similar News