‘మీ సంక్షేమం మా బాధ్యత’.. వరదల పరిస్థితిపై సీఎం

ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షల మంది ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇళ్లు, సామాగ్రి, పంటలు అంతా కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాయి వేల కుటుంబాలు.

Update: 2024-09-12 08:38 GMT

ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షల మంది ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇళ్లు, సామాగ్రి, పంటలు అంతా కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాయి వేల కుటుంబాలు. ప్రస్తుతం ఏలూరు వరదల్లో ముంపుకు గురైన ప్రాంతాలకు చంద్రబాబు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులందరికీ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్రా ఇంకా ఎటువంటి నష్టం జరిగినా ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తామన, ఈ సహాయం ఈ నెల 17 లోగా అంటే మరో ఐదు రోజుల్లో అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా పంటను కోల్పోయిన రైతులకు పంటను బట్టి పరిహారం అందిస్తామని చెప్పారు. వరి పంట ఒక్కో ఎకరాకు రూ.10 వేల చొప్పున తక్షణ పరిహారం అందిస్తామని, ఆ తర్వాత లెక్కలు మొత్తం చూసి మిగులు పరిహారం కూడా ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన వారిలో 70 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, కోలుకునే స్థితిలో ఉన్న పంటలకు ఉచిత ఎరువులు అందించేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు.

దుస్తులు, వంట సామాగ్రికి డబ్బు..

వరదల్లో అంతా కోల్పోయిన కుటుంబాలకు దుస్తులు, వంట సామాగ్రి కొనుగోలు చేసుకోవడానికి రూ.10 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం. బాధిత కుటుంబాలకు దుస్తుల పంపిణీని కూడా త్వరితగతిన చేపట్టి.. రెండు రోజుల్లో ప్రతి ఒక్కరికీ దుస్తులు అందేలా చూస్తామన్నారు. ‘‘దెబ్బతిన్న ప్రతి ఇంటినీ నిర్మిస్తాం. ఆటో, సైకిల్ రిక్షా పాడైతే వారికి రూ.10 వేల చొప్పున సహాయమందిస్తాం’’ అని కాకినాడ పర్యటనలో వెల్లడించారాయన. ‘‘కృష్ణానదిలో ఎప్పుడూ ఊహించని వరద వచ్చింది. ప్రకాశం బ్యారేజీనిి 11.90 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా నిర్మించారు. 70 ఏళ్లుగా ఈ బ్యారేజీ ఏపీకి విశేష సేవలందిస్తోంది. ఈ బ్యారేజీపైన ఎన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చింది. దీనికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే. కృష్ణా జిల్లాలోని కోడూరు మండలంలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏడాదిలో నమోదయ్యే వర్థపాతం..ఈ రెండు రోజుల్లో కురిసింది. వాతావరణంలో వచ్చిన మార్పులకు కోతు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం స్వార్థం, చేతకానితనం వల్లే వరదలతో ఒక యుద్ధమే చేశాం’’ అని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై రైతులు, వరద ప్రభావిత ప్రాంతా ప్రజలతో నిర్వహించిన సమవేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

మీ భవిష్యత్తు మా బాధ్యత

‘‘అప్పలు, అక్రమాలు, ఆక్రమణలతో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజలు ఊపిరూదారు. ఈ ప్రజల కోసమే అనునిత్యం పని చేస్తాం. వారి కష్టాలు, సమస్యలను తీర్చడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా అహర్నిశలు శ్రమిస్తారు. ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడానికి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నాం. మీ సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వండి. తద్వారా సీఎం, డిప్యూటీ సీఎంలు మీ అభిప్రాయాలను నేరుగా తెలుసుకోగలుగుతారు. దానిని బట్టి వారు తమ నిర్ణయాల్లో మార్పులు తీసుకోవడం లేక మరింత సూట్ అయ్యే నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది’’ అని వివరించారు.

ఏలేరు ఆధునికీకరణ చేస్తాం..

ఏలేరు ప్రాజెక్ట్ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వ హాయంలో నిధులు కూడా మంజూరు చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కానీ ఆ పనులను గత ప్రభుత్వం చేయలేదని, నిధులను కూడా దారి మళ్లించిందంటూ మండిపడ్డారు. వారు చేసిన ఆ తప్పు వల్లే ఈరోజున ఏలేరు వరదల వల్ల అనేక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వేల మంది రైతుల చావే తమకు గతి అన్న స్థితిలోకి వెల్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అయితే ఏలేరు ఆధునికీకరణ ప్రాజెక్ట్‌ను మళ్ళీ ప్రారంభిస్తామని, ఏలేరును పూర్తిగా ఆధునికీకరించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని, ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని హామీ ఇచ్చారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.4లక్షల రుణం ఇస్తామని, పిల్లకు ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పారు.

Tags:    

Similar News