ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం.. పోరుబాట పట్టిన విద్యార్థినులు

మహిళను గౌరవించాలని చెప్పే భారతదేశంలో ఆ మహిళలకే భద్రత లేకుండా పోయింది. ఒక మహిళ అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఒక మహానుభావుడు అన్నారు.

Update: 2024-08-30 07:34 GMT

మహిళను గౌరవించాలని చెప్పే భారతదేశంలో ఆ మహిళలకే భద్రత లేకుండా పోయింది. ఒక మహిళ అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఒక మహానుభావుడు అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థరాత్రి రోడ్డుపై దేవుడెరుగు.. విద్యను అందించే కళాశాలలో, పుట్టింట్లో కూడా స్వేచ్ఛగా, భద్రంగా బతకలేన్నారు మహిళలు. ఎక్కడ చూసినా వారిపై అఘాయిత్యాలు జరుగుతుండటం దారుణం. కొంత కాలంగా దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఘోరమైన విషయం ఒకటి వెలుగు చూసింది. దాదాపు 300 మంది విద్యార్థినులు ఉన్న ఈ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూం‌లో ఎవరో దుండగులు సీక్రెట్ కెమెరా ఒకటి అమర్చి.. అమ్మాయిలు స్నానాలు చేస్తున్న వీడియోలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఏపీ అంతటా ఈ వార్త కలకలం రేపుతోంది.

గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో ఓ విద్యార్థిని సహాయంతో ఫైనల్ ఇయర్‌కు చెందిన విజయ్ అనే కుర్రాడు ఈ పనికి పాల్పడ్డాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సదరు విజయ్ అనే కుర్రాడికి అంతా కలిసి దేహశుద్ది కూడా చేశారు. ఇంతలో పోలీసులు వారిని అడ్డుకుని విజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థినులు అంతా పోరుబాట పట్టారు. తమకు న్యాయం జరిగే వరకు తాము వెనక్కు తగ్గమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు పోలీసులు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఇదంతా ఫేక్ అంటూ జరుగుతన్న ప్రచారంపై స్పందిస్తూ.. దర్యాప్తు చేయడానికి పోలీసులు నెల రోజుల సమయం కావాలని రాత్రి కోరారని, తెల్లారే సరికి ఇదంతా ఫేక్ అంటూ ప్రచారం చేయడం దారుణమని అన్నారు. మహిళల భద్రత అంతే చులకనైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘వాష్‌రూప్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీశారు. వాటిని వాళ్లు అమ్ముకుంటున్నారు’’ అని విద్యార్థినులు ఆరోపించారు. విజయ్‌ను పోలీసులు అక్కడికి తీసుకురావడంతో విద్యార్థినులు ఒక్కసారిగా విజయ్‌పై దాడి చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు విజయ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడిని విచారించిన అనంతరం అతడి ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో విద్యార్థినులకు సంబంధించి దాదాపు 300 వీడియోలు గుర్తించినట్లు సమాచారం.

Tags:    

Similar News