గుంటూరు ఎమ్మెల్యే "ముద్దూ, ముచ్చట": సూఫియా ఆత్మహత్యాయత్నం

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్నట్టుగా ఓ ఎమ్మెల్యే "ముద్దూ, ముచ్చట" మరో మహిళ బలవన్మరణ యత్నానికి దారి తీసింది.;

Update: 2025-08-16 03:11 GMT
ఓ ఎమ్మెల్యే ముద్దూ ముచ్చట మరో మహిళ బలవన్మరణ యత్నానికి దారి తీసింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్నట్టుగా ఉన్నా- జరిగింది మాత్రం నిజం. గుంటూరులో బాగా రద్దీగా ఉండే బస్టాండ్ కి సమీపంలోని టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది.
దీంతో గుంటూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మహిళా కార్యకర్త సూఫియా గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కార్యాలయం ఎదుట నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే సూఫియా పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు పార్టీ మహిళా నాయకురాలు ఒకరితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయం ఆ నాయకురాలి భర్త నవీన్ కృష్ణ ద్వారానే తనకు తెలిసిందని పేర్కొంది. తాను ఈ విషయాన్ని బయటపెట్టినందుకు తమ కుటుంబంపై పోలీసులు వేధింపులు పెరిగాయని ఆరోపించింది. ఈ బాధలు పడలేకే ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పింది. ఆ మహిళా నాయకురాలి భర్త నవీన్ కృష్ణ స్వయంగా తనకీ విషయం చెబితే తాను ఎమ్మెల్యేతో చెప్పినట్టు ఆమె వివరించారు. నిజానిజాలు తెలుసుకునేందుకు నవీన్, విజయ్ కృష్ణలను అరెస్ట్ చేసి, వారి ఫోన్లలోని ఆధారాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ వివాదం ఒక వైరల్ వీడియోతో మొదలైంది. అందులో ఎమ్మెల్యే ఒక మహిళతో వీడియో కాల్‌లో కనిపించారు. అయితే ఆ వీడియో కృత్రిమ మేధ (AI)తో సృష్టించిందని, ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని ఎమ్మెల్యే నసీర్ ఖండించారు.
డీఎస్పీ అబ్దుల్ మాట్లాడుతూ, సూఫియానే ఈ కేసులో ప్రధాన నిందితురాలని, ఆమె ఫిర్యాదుదారుడి (నవీన్ కృష్ణ) ఫోన్ హ్యాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అయితే ఆమె స్వయంగా తన ఫోన్ ను పోలీసులకు ఇచ్చారని పేర్కొన్నారు. వీడియో నిజమో కాదో తెలుసుకోవడానికి దానిని నిపుణుల ద్వారా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
అసలేమిటీ వివాదం...
గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఓ మహిళతో మాట్లాడుతున్న వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయింది. ఓ మహిళతో సరస సల్లాపాలతో కూడిన సంభాషణ అది. అయితే ఆ వీడియోను ఎమ్మెల్యే తోసిపుచ్చారు. ఏఐతో సృష్టించిందని చెప్పారు. దీనిపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. టీడీపీ పెద్దల వరకు ఈ విషయం వెళ్లింది.
ఈనేపథ్యంలో టీడీపీ మహిళా కార్యకర్త సూఫియా ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు ఓ టీడీపీ మహిళా నేతకు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవం. ఆ మహిళా నేత భర్త నవీన్ కృష్ణే నాకు చెప్పాడు’’ అంటూ చెప్పుకొచ్చింది.
‘‘నేను నా భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకువెళ్లే వాడినని నవీన్ కృష్ణ నాకు చెప్పాడు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేశాడు. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునే కాల్స్ అన్ని భర్త నవీన్ కృష్ణ వింటూ ఉండేవాడు. తన భార్యకు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు సంబంధించిన వీడియోలు ఆమె భర్త నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయి. నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి ఆమె భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నసీర్‌ బెదిరించాడు. ఇప్పుడు వాళ్లందరూ ఏకమై ఈ వ్యవహారాన్ని నాపై నెడుతున్నారు.
..పోలీసులు మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయి. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడు. నవీన్ కృష్ణ, ఆయన భార్య వాళ్ల బంధువు విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని సూఫియా పేర్కొంది.
బలిపశువుని చేస్తున్నారు..!
గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్‌ అహ్మద్‌ ‘ముద్దు’ దృశ్యాల వీడియో వైరల్‌ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తు­న్నా­రంటూ పార్టీ మహిళా నేత షేక్‌ సూఫియా వాపోయింది. పా­ర్టీ నాయకు­రాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వి­వా­హేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ తె­లుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు.
ఎమ్మె­ల్యే­తో సన్నిహి­తంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్‌కృష్ణ స్వయంగా రికార్డ్‌ చేసి వైరల్‌ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్‌కు చెప్పడంతో రెండు రోజులు మాట్లాడ­కుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్‌­మెంట్‌ చేసుకుని తనని ఇరికించే యత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్‌కృష్ణ ఫోన్‌లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపో­తున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.
ఆత్మహత్య నివారణ సహాయం కోసం:
One Life: 78930 78930
రోష్ని (హైదరాబాద్‌ ఆధారిత NGO): 040-66202000
Tags:    

Similar News