ఈ అమెరికా డాక్టర్ గుంటూరులో టిడిపిని కాపాడతాడా?

గుంటూరు పార్లమెంట్‌ సీటు నాదే నని టిడిపికి ఒక ధీమా ఉండేది. అది గతవైభవంగా మిగిలిపోతుందా లేక టిడిపి హవా కొనసాగుతుందా? అమెరికా డాక్టర్ని నమ్ముకున్నటిడిపి

Update: 2024-03-18 13:15 GMT
Pemmasani Chandrasekhar

(జి. విజయ కుమార్


విజయవాడ: గుంటూరు  ఎంపి స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఓటమి చవిచూసిన ఆ పార్టీ ఎలాగైనా ఈ సారి గెలవాలనే లక్ష్యంతో ఉంది. మరో వైపు గుంటూరు పార్లమెంట్‌ స్థానాన్ని టీడీపీ అడ్డాగా మార్చుకున్న చంద్రబాబు దానిని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఆచితూచి అభ్యర్థుల ఎంపిక
Delete Edit

గుంటూరు పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోశయ్యను సిఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అభ్యర్థి ఎంపికలో అనేక తర్జన భర్జనలు జరిగాయి. తొలుత ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించారు. తర్వాత మర్పు చేశారు. ఆయన స్థానంలో కిలారు రోశయ్యను తీసుకొచ్చారు. ప్రస్తుతం కిలారు రోశయ్య పొన్నూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన బొత్స సత్యనారాయణకు బంధువు. పార్టీ సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లుకు కూడా అల్లుడు.

చంద్రబాబు కూడా మంచి అభ్యర్థి కోసం పరిశోధన చేశారు. సిట్టింగ్‌ ఎంపి గల్లా జయదేవ్‌ రాజకీయాలకు దూరం టిడిపికి దెబ్బ. ఎందుకంటే  ఆయన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అంత సులభం కాదు. ఇది ఇపుడు చంద్రబాబుకు సవాల్‌గా మారింది. టిడిపి అభ్యర్థులంటూ  అనేక పేర్లు వినిపించాయి. అయితే చివరకు డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరును చంద్రబాబు ఖరారు చేశారు.
ఈయన ఎన్‌ఆర్‌ఐ. అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్నారు. అక్కడికి వెళ్లి పోటీ పరీక్షల మెటీరియల్‌ తయారు చేయడంలో మంచి పేరు సంపాదించారు. యువరల్డ్‌ అనే సంస్థను అమెరికాలో స్థాపించి తాను తయారు చేసిన పోటీ పరీక్షల మెటీరియల్‌ అమ్మడం ద్వారా బాగా సంపాదించారని చెబుతారు. 2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట సీటు ఆశించారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లోనూ సీటు ఆశించి రాకపోవడంతో వెనుదిరిగారు.

2024 ఎన్నికల్లోనూ నర్సరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఆశించారు. అయితే అక్కడి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి రావడంతో చంద్రబాబు ఆయనకు సీటు ఖరారు చేశారు. అయితే,ఆర్థికంగా బలవంతుడైన అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌  గుంటూరుకు ధీటైన అభ్యర్థి అని  చంద్రబాబు భావించారు. ఆయన్ె సీటు ఇచ్చారు. పెమ్మసానిది తెనాలి పట్టణం. గుంటూరులోనూ పరిచయాలు ఉన్నాయి.
ఈ టికెట్ కు  పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల సామాజిక వర్గాలు వేరు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా టీడీపీ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో రెండు సామాజిక వర్గాల ఓట్లు దాదాపు సమానంగానే ఉంటాయి. తన సామాజిక వర్గం ఓట్లు చీలకుండా చూసుకుని, ప్రత్యర్థి సామాజిక వర్గం ఓట్లు చీల్చ గలిగితే, ఎవరికైనా గెచిచే అవకాశాలు ఉంటాయి.

గుంటూరు నుంచి ఉద్దండులు

గుంటూరు పార్లమెంట్‌ కింద తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్‌ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు ప్రాంతం నుంచి ఉద్దండులైన నేతలు రాజకీయాలను శాసించారు. భవనం వెంకట్రామ్, కాసు బ్రహ్మానందరెడ్డి, కే రోశయ్య, నాదెండ్ల భాస్కర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేశారు.

రెండుసార్లు  వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి

గుంటూరు పార్లమెంట్‌ నియోజక వర్గం జనరల్‌ స్థానం. ఇక్కడ కమ్మ, కాపు వర్గాలు డామినేటింగ్‌ కమ్యూనిటీలు. రాజకీయంగా వీరి ప్రాబల్యం ఎక్కువుగా ఉంటుంది. ఈ నియోజక వర్గంలో అధికంగా బీసీలు ఉంటారు. తర్వాత ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. ఈ పార్లమెంట్‌ పరిధిలో 4లక్షల వరకు ఎస్సీ ఓటర్లు ఉంటారు. దాదాపు 80వేల వరకు గిరిజన ఓటర్లు ఉంటారు. ముస్లీంలు 12 శాతం వరకు ఉంటారు.

2019లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిని ఒక సారి పరిశీలిస్తే వైఎస్‌ఆర్‌సీపీకి దాదాపు 43.3 శాతం ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 43.7 శాతం ఓట్లు లభించాయి. అంటే కేవలం 0.4శాతం ఓట్ల మెజారిటీతో టీడీపీ విజయం సాధించింది. మంగళగిరి, పొన్నూరు, గూంటూరు వెస్ట్‌తో కలిపి మూడు నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లభించగా, తాడికొండ, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఆధిక్యం లభించింది. 2014లో 44.1 శాతం ఓట్లు వైఎస్‌ఆర్‌సీపీకి రాగా 49.7శాతం ఓట్లు టీడీపీకి వచ్చాయి. 2014,2019 ఎన్నికల్లోను టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గల్లా జయదేవ్‌ విజయం సాధించారు.

నాలుగు పర్యాయాలు టీడీపీ
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నాలుగు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంది. 13 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ నుంచి ఒక్క సారిగా కూడా వైఎస్‌ఆర్‌సీపీ ఖాతా తెరవలేక పోయింది.2014లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వల్లభనేని బాలశౌరీ పోటీ చేసి ఓడి పోయారు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఓటమి చవి చూశారు. ఈ రెండు దఫాలు టీడీపీనే ఈ స్థానం నెగ్గింది. 2014లో 69వేలకు పైచిలుకు మెజారిటీతోను 2019లో 4వేల ఆధిక్యంతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ఓడించారు. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపొంది పార్లమెంట్‌ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.

విరామం ప్రకటించిన గల్లా

రెండు దఫాలుగా విజయం సాధించిన గల్లా జయదేవ్‌ కుటుంబంపై సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టి సారించారు. గల్లా కుటుంబానికి చెందిన కీలక వ్యాపారమైన అమర్‌రజా సంస్థపై బాణం ఎక్కు పెట్టారు. సమస్యలు సృష్టించారు. దీంతో తన వ్యాపారాలను తెలంగాణ, తమిళనాడుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. నాటి నుంచి గల్లా జయదేవ్‌ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండి పోయారు. తర్వాత ఆయన విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇపుడు కొత్త అభ్యర్థి గల్లా స్థానాన్నిభర్తీ చేస్తారా లేదా అనేది ప్రశ్న.
Tags:    

Similar News