1) దేశంలో కులగణన నిర్వహించాలి. ఆ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి.
2) ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను భారత్ రద్దు చేయాలి. న్యాయం కోసం పాలస్తీనాలో సాగుతున్న పోరాటానికి HRF సంఘీభావం తెలిపింది.
3) ప్రార్ధనామందిరాల చట్టం, 1991 ప్రకారం మైనారిటీల మతస్థలాలపై దాడులు అరికట్టాలి.
4) మహిళలపై లైంగిక వేధింపులను విచారించే వ్యవస్థలను బలోపేతం చేయాలి.
5) నూతన విద్యావిధానం - 2020ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.
6) న్యాయవ్యవస్థ సభ్యులు రాజ్యాంగం స్ఫూర్తికి కట్టుబడి ఉండాలి.
7) కనీస మద్దతు ధర (MSP), రుణమాఫీ, వ్యవసాయ కూలీల సామాజిక పింఛన్ల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తున్న రైతులపై లాఠీచార్జిని ఖండించింది. లగచర్ల, దిలావర్‌పూర్, చిత్తనూరు రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి.తెలంగాణలో పోడు సాగుదారులకు భూమిపై హక్కు హామీని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చాలి.
8) గౌతమ్ అదానీ వ్యాపారాలపై జేపీసీ ఏర్పాటు చేయాలి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి.
9) బస్తర్‌లో 'ఎన్‌కౌంటర్ల' పేరుతో హత్యలకు పాల్పడుతోంది. ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా గుర్తించాలి.
10) UAPA వంటి అప్రజాస్వామిక చర్యలన్నింటినీ రద్దు చేయాలి. జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడుదల చేయాలి.
11) సోంపేట ఉద్యమ సమయంలో 723 మందిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి.
12) ఏపీలోని ఐదో షెడ్యూల్ ప్రాంతంలో పంప్ డ్ స్టోరేజీ ప్లాంట్‌లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలు సక్రమంగా అమలు చేయాలి. G.O. 3ని పునరుద్ధరించాలి.
13) పర్యాటకంతో సహా పారిశ్రామిక అవసరాల కోసం తీరప్రాంతాలను ధ్వంసం చేయడం ఆపాలి
14) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించి ఆదుకోవాలి.
15) జిల్లాల్లో ట్రాన్స్ జెండర్ సంఘాలకు భద్రతా గృహాలు ఏర్పాటు చేయాలి.
16) కాలుష్య నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయాలి. ఈజ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కాలుష్య నియంత్రణకు సంబంధించిన చట్టాలు మార్చేదుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను మహాసహ వ్యతిరేకించింది.
17) బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై (హిందువులు మరియు ఇతరులు) జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాము.
18) మణిపూర్‌లో మెజారిటీ కమ్యూనిటీ, మైనారిటీ గిరిజనుల మధ్య హింసను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి.
19) కశ్మీరీల ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించి, రాజ్యహింసను ఆపాలి. దీనికి భారతదేశం సంతకం చేసిన UN మానవ హక్కుల ప్రకటన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి.
20) కేంద్ర ప్రభుత్వం వెంటనే జమిలీ ఎన్నికల బిల్లు ఉపసంహరించుకోవాలి. సీఈసీ EVM ఓటింగ్‌పై సందేహాలను నివృత్తి చేయాలి.
21) రాయలసీమలో పశ్చిమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోంది. కృష్ణా మిగులు జలాల్లో 4 టీఎంసీల కేటాయింపు ఉంది. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్) పూర్తి చేయాలి.
22) SC-ST ఉప-వర్గీకరణ చట్టబద్ధంగా వీలైనంత త్వరగా అమలు చేయాలి. SC ST (PoA) చట్టం కింద నేరాల దర్యాప్తు అధికారులు (DSP) నిందితులపై పక్షపాతం చూపకూడదు.
23) న్యాయవ్యవస్థలో కేసులను పరిష్కానికి జడ్జీలు, ఉద్యోగులను నియమించాలి.
24) బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న 'బుల్డోజర్ న్యాయాన్ని' ఖండించారు.