ఏపీలో చల్లబడ్డ వాతావరణం

ఆంధ్రలో వాతావరణం ఈరోజు చల్లబడింది. ఎండలకు మండుతున్న ప్రజలు ఈరోజు చల్లని గాలులతో స్వాంతన చెందారు. విజయవాడలో మాత్రం సీన్ వేరేలా ఉంది.;

Update: 2024-04-13 13:12 GMT
ఏపీలో చల్లబడ్డ వాతావరణం
Source: Twitter

వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రలో వాతావరణం ఈరోజు చల్లబడింది. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ విజయవాడలోని ప్రజలు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఎక్కడివారక్కడ ఆగిపోయారు. అందుకు అక్కడ కురిసిన భారీ వర్షమే కారణం. ఈరోజు విజయవాడలో దాదాపు గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీని కారణంగా హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతేకాకుండా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు ఈ వర్షం వల్ల జలమయం అయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం సాయంత్రం 4గంటలకు వరకు కురిసింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇదే విధంగా మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News