కొడుకు దేవాన్ష్ పుట్టిన రోజున బ్రహ్మణి దీవెనలు ఎలా ఉన్నాయంటే..!

దేవాన్స్ 10వ పుట్టిన రోజున తిరుమల వేదికగా ట్విటర్ (ఎక్స్) ద్వారా తల్లి నారా బ్రహ్మణి ఏమన్నారంటే...;

Update: 2025-03-21 09:23 GMT

‘నువ్వు చాలా తెలివైన, దయగల, అద్భుతమైన అబ్బాయిగా ఎదుగుతున్నావు. నిన్ను చూసి నేను ఇంతకంటే గర్వపడను. నువ్వు చిన్న వాడివిగా అనిపించ వచ్చు. కానీ నా జీవితంలో.. నువ్వు చాలా అందమైన పాత్రలు పోషిస్తున్నావు. నువ్వు నా చిన్న ఆనందపు మూటవి. నా ప్రాణ స్నేహితుడు, నా అతిపెద్ద చీర్ లీడర్, కొన్ని సార్లు నా గురువు కూడా! నీ నవ్వు మన ఇంటిని ఆనందంతో నింపుతుంది. నీ దయ నా హృదయాన్ని గర్వపరుస్తుంది. నీ ప్రేమ ప్రతి రోజూ నాకు బలాన్ని ఇస్తుంది.’

Delete Edit

అంటూ.. దేవాన్స్ తల్లి నారా బ్రహ్మణి ట్విటర్ వేదికగా కొడుకు గురించి రాసిన తీరు ఆమె కు కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమను తెలియజేస్తుంది. అన్నింటిలోనూ నాకు తోడు అంటూనే కొడుకు తెలివి తేటలను మెచ్చుకున్నారు. కొడుకులోని దయా హృదయాన్ని కూడా ఆమె వేరే కోణంలో చూశారు. కొడుకు నుంచి తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయం నాకు నువ్వు గురువు కూడా అన్నప్పుడు అర్థం అవుతోంది. అన్ని కోణాల్లోనూ కొడుకు గొప్పతనాన్ని బ్రహ్మణి ఎంత స్వీట్ గా చెప్పారో ఆమె ట్వీట్ చెప్పకనే చెబుతున్నది.

Delete Edit

మరో ట్వీట్ లో.. ‘ఈ రోజు మాకెంతో ప్రత్యేకమైన రోజు. దేవాన్స్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరం తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు కోరాం. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నాం. ఆనవాయితీగా ఈ ఏడాది కూడా ఒక రోజు అన్న ప్రసాదాలకు అయ్యే ఖర్చు రూ. 44 లక్షలను అన్న ప్రసాద ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాం. తర్వాత అన్నదాన కేంద్రంలో తాత, నాయనమ్మలతో కలిసి దేవాన్స్ భక్తులకు అల్పాహారాన్ని స్వయంగా వడ్డించాడు.’ అంటూ ట్విటర్ లో గర్వంగా చెప్పారు.

Delete Edit

కొడుకు గురించి ఓ తల్లి తపన, ప్రేమ, అభిమానం ఎలా ఉంటుందో ఆమె వ్యక్తం చేసిన మాటలు చెబుతున్నాయి. బ్రహ్మణి సామాజిక మాధ్యమాల్లో మనసును హత్తుకునే ఫొటోలు, మాటలు షేర్ చేస్తుంటారు.

Tags:    

Similar News