సీఆర్‌డిఏ భవనం ఎలా ఉండాలి.. ఆన్‌లైన్‌ ఓటింగ్‌

కూటమి ప్రభుత్వం సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అమరావతి నిర్మాణం పట్ల ప్రజల్లో ఆసక్తిని నింపేందుకు తెరలేపింది.;

Update: 2024-12-08 07:03 GMT

అమరావతి నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం ప్రజా అభిప్రాయసేకరణకు తెరతీసింది. రాజధాని అమరావతిలో చేపట్టే అన్ని నిర్మాణాల్లోకి సీఆర్‌డీఏ భవన సముదాయం నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై తొలుత ఒపీనియన్‌ పోల్‌ను చేపట్టింది. సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో ఓటింగ్‌ను నిర్వహించింది. ఓ 10 డిజైన్లు చూపించి దానిలో ఏది బాగుందో చెప్పాలని కోరింది. దాదాపు వారం రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అయితే ఎక్కువ మంది ఆప్షన్‌ 4 వైపు మొగ్గు చూపారు. నాలుగో డిజైన్‌ బాగుందని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వారం రోజుల్లో 9, 756 మంది తమ అభిప్రాయాలను వెల్లడించగా, అందులో నాలుగో ఆప్షన్‌కు 3,354 మంది బాగుతుందని, మద్దతు తెలిపారు. ఆప్షన్‌ 10లో ఉన్న నమూనా డిజైన్‌ బాగుందని 3,279 మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆప్షన్‌ 8కి 17.11 శాతం, ఆప్షన్‌ 3కు 5.38 శాతం ఆప్షన్‌ 6కి 236 మంది, ఆప్షన్‌ 1కి 235 మంది, ఆప్షన్‌ 7కి 151 మంది, ఆప్షన్‌ 9కి 1.51 శాతం, ఆప్షన్‌ 2కి 83 మంది, ఆప్షన్‌ 5 77 మంది తమ మద్ధతు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో దీనిని కంప్లీట్‌ చేయాలని నిర్ణయించుకుంది. మూడేళ్లల్లోనే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ఇది వరకే ప్రకటించారు. దశల వారీగా ఈ నిర్మాణాల పనులు చేపట్టనున్నారు. తొలి దశ కింద రూ. 11,467 కోట్లతో పనులు ప్రారంభించారు. రూ. 2,498 కోట్లతో ప్రధాన రహదారుల పనులు, రూ. 1585 కోట్లతో అమరావతిలో ప్రహహించే పాలవాగు, కొండవీటి వాడు, గ్రావిటేషన్‌ కాలువల అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు మూడు రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. వీటితో పాటుగా అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాలను కూడా పూర్తి చేయనున్నారు. రూ. 3,525 కోట్లతో వీటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.
Tags:    

Similar News