గోవిందరాజపట్నం తిరుపతిగా ఎలా మారింది?
తిరుపతి 894 యేళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్రను చాటిచెప్పేందుకు తిరుపతి ఉత్సవాలు
కలియుగా వైకుంఠం క్షేత్రం తిరుపతి పుట్టినరోజు సంబరాలకు సిద్ధమైంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న తిరుపతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24న ఘనంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా నిర్వహించే తిరుపతి 894వ పుట్టినరోజు వేడుకలు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. గత రెండు సంవత్సరాలుగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది తిరుపతి నగరమని తెలిపారు .
గోవిందరాజపట్నం అంచెలంచెలుగా ఎదిగి తిరుపతి మహానగరమైందన్నారు. మనుషులకు పుట్టినరోజు తరహాలో ఊరికి పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నామని వివరించారు. నగరమంతా పుట్టినరోజు పండుగ చేసుకుందామని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 24న గోవిందరాజస్వామి ఆలయం దగ్గర నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ చేద్దామని శ్రీ మహా విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో తిరుపతి ఒకటి.