‘అన్న’ క్యాంటిన్ లో ‘అన్నం’ ఎలా ఉందంటే...

అన్న క్యాంటిన్ ల ద్వారా ఏపీ ప్రభుత్వం ఐదు రూపాయలకు పెడుతున్న అన్నంలో క్వాలిటీ పెరగాలి.

Update: 2024-12-19 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటిన్ ల ద్వారా పేదలకు పెడుతున్న అన్నం సూపర్ గా ఉందని చెప్పలేము. అలాగని బాగా లేదని చెప్పలేము. పేదవాడు తినగలిగే స్థాయిలో ఉందని మాత్రం చెప్పొచ్చు. రెండు గరిటెలు అన్నం, ఒక కూర, సాంబాబు, పెరుగు, ఊరగాయ చట్నీ మధ్యహ్నాం ఇస్తున్నారు. అన్న క్యాంటిన్ లో భోజనం ఎలా ఉంటుందో పరిశీలించేందుకు చెన్నై, కోల్ కత్తా జాతీయ రహదారిపై కృష్టలంక సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్న క్యాంటిన్ కు ది ఫెడరల్ ప్రతినిధి గురువారం మధ్యహ్నాం వెళ్లాడు. ఐదు రూపాయలు ఇస్తే టోకన్ ఇచ్చారు. ఈ టోకన్ తీసుకుని లోపలికి వెళితే ప్లేట్ తీసుకున్నాక రెండు గరిటెలు అన్నం వడ్డించారు. దోసకాయతో చేసిన కూర ఒక గరిటెడు వేశారు. సాంబారు, ఊరగాయ చట్నీ వేశారు. కూర అన్నం తిన్న తరువాత అందులో గరిటెడు పెరుగు వేశారు.

క్వాలిటీ ఎలా ఉందంటే...

అన్నం కొంచెం గట్టిగా ఉంది. బియ్యం కాస్త ముద్దవుతున్నాయి. భోజనం వండుకుకుని డిష్ లలో పెట్టుకుని వాహనంలో తీసుకొస్తారు. తినబోయే సరికి కాస్త చల్లారుతుంది. దీంతో అన్నం గడ్డ కడుతోంది. దానిని నలుపుకుని తినాల్సి వస్తోంది. దోసకాయతో తయారు చేసిన కూరలో నూనె ఛాయలు కనిపించలేదు. నీళ్లు ఎక్కువగా పోశారు. దోసకాయ కూడా నూరు శాతం ఉడకలేదు. ఇక సాంబారు విషయానికి వస్తే కూరగాయలు ఎక్కడో ఒక సొరకాయ ముక్క కనిపిస్తోంది. మునక్కాయ వాసనే లేదు. కాయకూరలు కూడా మార్కెట్లో ఏవి తక్కువకు వస్తే అవి తెస్తున్నారని అర్థమైంది. సాంబారులో కొట్లో కొనుగోలు చేసే పొడి ఎక్కువ వేస్తున్నారు. ఇంగువ కూడా ఎక్కువగానే కలుపుతున్నారు. బియ్యం బెస్ట్ క్వాలిటీ కానందున అన్నం మద్దువుతోంది. రుచి కూడా సరిగా లేదు.

Delete Edit

ఏ పూట ఏమి ఇస్తారు...

ఉదయం పూట ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్ వంటి ఐటమ్స్ ఇస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు ఇస్తున్నారు. ఇడ్లీ, పూరీ అయితే 3 చొప్పున ఇస్తామని.. ఉప్మా లేదా పొంగల్ అయితే 250 గ్రాముల చొప్పున ఇస్తామని నిర్వాహకులు మెనూలో వివరించారు.

సమయం ఎలా ఉంటుంది..

ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ అందిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం పెడతారు. రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు క్యాంటీన్ తెరిచి ఉంటుంది. ఆదివారం మాత్రం సెలవు. వారంలో ఒక రోజు స్పెషల్ రైస్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

క్యాంటిన్ లో భోజనం తినేవారి సంఖ్య...

ప్రతి రోజూ క్యాంటీన్ లో పూటకు 350 మందికి భోజనం పెడతాం. ఆ తరువాత రద్దీని బట్టి ఆ సంఖ్యను పెంచుతాం అని క్యాంటిన్ లు ప్రారంభించిన రోజు సీఎం చంద్రబాబు చెప్పారు. మొదటి దశలో 100 క్యాంటీన్లు ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు కృష్టా జిల్లా గుడివాడలో ఆగస్టు 15న ప్రారంభించారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం, ఉదయం టిఫిన్‌కు 22 రూపాయలు, ఒక పూట భోజనానికి 34 రూపాయల చొప్పున ఖర్చు అవుతోంది. అంటే మూడు పూటలకు మొత్తం 90 రూపాయలు ఖర్చు అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఏడాదికి 200 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చెప్పారు.

హరేకృష్ణ ఫౌండేషన్ వారితో...

అన్న క్యాంటిన్ లకు అన్నం వండి పెట్టే బాధ్యతను ప్రభుత్వం హరేకృష్ణ ఫౌండేషన్ కు అప్పగించింది. ఈ ఫౌండేషన్ ద్వారా అక్షయ పాత్ర కార్యకలాపాలు సాగుతుంటాయి. ఒకచోట కిచెన్ ఏర్పాటు చేసి అక్కడ వండి పట్టణం, నగరంలోని క్యాంటిన్ లకు సరఫరా చేస్తారు.

విజయవాడలోని కృష్ణలంకలో ఏర్పాటు చేసిన క్యాంటిన్ లకు ఎక్కువగా వలస కూలీలు వస్తున్నారు. భవన నిర్మాణాలు, డ్రైనేజీ పనులు చేసుకునే వారు ఎక్కవ మంది మద్యహ్నాం పని ముగించుకుని వచ్చి తిని వెళుతున్నారు. ఎక్కవ మంది మధ్యాహ్నం మాత్రమే తింటున్నారు. రాత్రుల్లో తక్కువ మంది తింటున్నారు.

Delete Edit

క్వాలిటీ పెంచాలి

అన్నం, కూర, సాంబారులో క్వాలిటీ పెంచాలని క్యాంటిన్ లలో అన్నం తినే వారు చెబుతున్నారు. కృష్ణలంక ఏరియాలో ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకునే వారు తింటున్నందున వారి నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి. ఒరిస్సాకు చెందిన పచారి అనే వ్యక్తి మాట్లాడుతూ క్యాంటిన్ లో అన్నం, కూరలో క్వాలిటీ పెంచాలని కోరారు. అన్నం దుడ్డు బియ్యంతో కాకుండా సన్న బియ్యంతో వండాలని, కూరను ఇంకాస్త రుచిగా చేయాలని కోరారు.

విజయవాడకు చెందిన చెన్నాబత్తిన వెంకటరమణ మాట్లాడుతూ భోజనం బాగానే ఉందని, కూర మాత్రం బాగుండటం లేదన్నారు. సాంబారులో ఇంగువ వెయ్యకుండా కాస్త కూరగాయలు వేస్తే బాగుంటుందన్నారు. చౌకగా వస్తున్నాయని టమాటా, సొరకాయ వేస్తున్నారన్నారు. అయినా ఐదు రూపాయలు ఇస్తున్నారంటే ఇంతకంటే ఏమిస్తారన్నారు. మీ తరపున ప్రభుత్వం సబ్సిడీ కింద అక్షయ పాత్ర వారికి డబ్బులు ఇస్తోంది కదా అంటే తలూపుతూ వెళ్లిపోయారు.

Tags:    

Similar News