TIRUPATI STAMPEDE | తిరుపతి బైరాగిపట్టెడలో తొక్కిసలాట ఎలా జరిగింది?

అస్వస్థతకు గురయిన భక్తురాలికి చికిత్స చేయించేందుకు గేట్లు తెరవడమే కారణం...;

Update: 2025-01-09 00:25 GMT

తిరుపతి బైరాగిపట్టెడలోన ఒక వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది తిరుమలలో ఏర్పాటుచేసిన కేంద్రాలలో ఒకటి.ఇక్కడి రామానాయుడు మునిసిపల్‌ హైస్కూ లు ఆవరణలో టోకెన్ల జారీకి పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు, కర్నాటక, తెలంగాణల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. వీరంతా రోడ్ల మీదకు వస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పాడుతుందని అధికారులు వారిని హైస్కూలు వెనుకవైపు మునిసిపల్‌ పద్మావతి పార్కు లోకి మళ్లించారు.

అక్కడ భక్తులు గురువారం ఉదయం 5 గంటల దాకా వేచి ఉండాల్సి ఉంది. అంతా ఆత్రంగా భక్తితో ఎదురు చూస్తున్నారు. రద్దీగా ఉంది. గోళగా ఉంది. మధ్య మధ్య గోవింద నినాదాలు. అయితే, రాత్రి 8.50 సమయంలో క్యూలైన్ ఓపెన్ చేశారు. టోకెన్లకోసం గేట్లు తెలిరాచారని భావించారు. వేల సంఖ్యలో ఉన్న భక్తులు ఒక్కసారి అటువైపు పరుగుతీశారు. పార్కు నుంచి స్కూలులోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటు మీద జనం పడ్దారు. పెద్ద సంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీనితో తొక్కిసలాట జరిగింది.

తిరుపతి బైరాగిపట్టెడలో తొక్కిసలాట ఎలా జరిగింది?భక్తుల్లో మహిళలు, వృద్ధులు ఉండడంతో చాలామంది కిందపడిపోయారు. నలిగిపోయారు. "అందరుచూస్తుండగానే కాళ్ల కింద పడి నలిగిపోతున్నారు. మా కళ్లముందే మావాళ్లను తొక్కేయడం చూశా. ఇది పూర్తిగా పోలీసుల వైపల్యమే. బయట ఉన్నారే గాని పార్కు లోపలకువచ్చి కంట్రోల్‌ చేయలేకపోయార,"ని ఒక భక్తుడు వాపోయాడు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. అయితే పరిస్థితి అదుపులోకి వచ్చేసరికి దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు సీపీఆర్‌ వంటి చర్యలు చేపట్టారు.

అసలు జరిగిందేమిటి?

బైరాగిపట్టెడ కేంద్రం ఏమి జరిగిందనేందుకు ఒక కథనం ప్రచారంలో ఉంది. అక్కడి భక్తులు ఈ విషయం చెబుతున్నారు. ఇలా జరిగింది. కేంద్రంలో అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు గుమి కూడారు. ఇందులో ఉన్న ఒక మహిళ అస్వస్థతకు గురి అయింది. కుటుంబ సభ్యులు ఆమెకు కాపాడాలని అరిచారు. అమెకు చికిత్స అందించేందుకు ఆమెను బయటికి తీసుకురావాలి. దీనికోసం ఒక పోలీసు అధికారి గేటు తెరిచారు. దీనితో నిజంగా టోకెన్లు ఇచ్చేందుకు గేట్లు తెరిచారని అక్కడున్న భక్తులంతా భావించి గేటు వైపు తోసుకువచ్చారు. తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు. అయితే, దీనిని అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

భక్తులు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చారు?

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 10వ తేది నుండి 19వ తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న ప‌ది రోజుల వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌నాల‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. టిటిడి ప్రకటించిన కార్యక్రమం ప్రకారం జనవరి10వ తేది నుండి 19వ తేది వ‌ర‌కు 10 రోజుల పాటు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతారు. జ‌న‌వ‌రి 10వ తేది ఉద‌యం 4.30 గంట‌ల‌కు ప్రోటోకాల్ ద‌ర్శ‌నాలు ప్రారంభ‌మ‌వుతాయి. 8 గంట‌ల‌కు స‌ర్వ ద‌ర్శ‌నాలు ప్రారంభ‌మ‌వుతాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి 4 గంట‌ల వ‌ర‌కు మ‌ల‌య‌ప్ప‌స్వామి వాహ‌న మండ‌పంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు టోకెన్లు కోసం భక్తులు ఇలా తిరుపతికి తరలివచ్చారు.

జ‌న‌వ‌రి 9వ తేది తిరుప‌తిలోని 8 కేంద్రాల్లోని 90 కౌంట‌ర్ల‌లో, తిరుమ‌ల‌లో ఒక కేంద్రం(తిరుమ‌ల స్థానికుల‌కు మాత్ర‌మే)లోని 4 కౌంట‌ర్ల‌లో భ‌క్తుల‌కు 10, 11, 12వ తేదీల‌కు సంబంధించి 1.20 ల‌క్ష‌ల ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తారు. 13వ తేది నుండి 19వ తేది వ‌ర‌కు ఏరోజుకారోజు టోకెన్లు జారీచేస్తారు. ప‌ది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబ‌ట్టి భ‌క్తులెవ్వ‌రూ అధైర్య‌ప‌డ‌కుండా టోకెన్లు పొందాల‌ని అధికారులు చెబుతూవచ్చారు.

తిరుప‌తిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తిరుమ‌ల‌ వాసుల‌కు బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఎస్ఎస్ డీ టోకెన్లు జారీకి ఏర్పాట్లు చేశారు. దాదాపు 7 ల‌క్ష‌ల మందికి పైగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ప్రకటించింది.


Tags:    

Similar News