'పీఎం సూర్య ఘర్' యోజన కింద దరఖాస్తుదారులు ఎంత మందంటే..
కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ పథకం గురించి వివరించారు.;
'పీఎం సూర్య ఘర్' యోజన పథకంకపై ప్రజల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు, ఇన్‌స్టాలేషన్‌లు పెరిగేలా చూడాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ పథకం కోసం నేషనల్ పోర్టల్ ద్వారా ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ కింద 6.39 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 77.09 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 6.5 వేల ఇన్‌స్టాలేషన్లు పూర్తయ్యాయి. ఈ పథకం ద్వారా కేంద్రం ఒక్కో కిలో వాట్‌కు రూ.30 వేలు, రెండు కిలో వాట్లకు రూ.60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు రాయితీ ఇస్తుందన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు ఏపీఈపీడీసీఎల్ కింద రూ.10.88 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ కింద రూ.7.74 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ కింద రూ.6.64 కోట్లను మొత్తంగా రూ.25.27 కోట్లను సబ్సిడీగా విడుదల చేయడం జరిగిందన్నారు.