టెన్త్ హాల్ టికెట్లను పిల్లలకు ఇలా డౌన్‌లోడ్‌ చేసివ్వండి!

పిల్లలు పుస్తకాలతో కుస్తీ... పెద్దలు మొబైల్ ఫోన్లతో సతమతం.. ఈ పరిస్థితుల్లో పెద్దలు తమ పిల్లలకు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసి ఇస్తే వాళ్లకో టెన్షన్ తగ్గుతుంది.;

Update: 2025-03-04 13:07 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఇంకో 13 రోజుల్లో పదో తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే పెద్దలు ఎలాగూ మొబైల్ ఫోన్లతో సతమతం అవుతుంటుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దలు తమ పిల్లలకు తమ వద్ద మొబైల్ ఫోన్లతో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసి ఇస్తే వాళ్లకో టెన్షన్ అయినా తగ్గుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే..
ఏపీలో మార్చి 17 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు (AP SSC Hall tickets) విడుదలయ్యాయి. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను నేరుగా వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. హాల్‌టికెట్లను మనమిత్ర (వాట్సప్‌ నంబరు 9552300009)తో పాటు అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, పాఠశాల పేరు, విద్యార్థి పేరుతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
వాట్సప్‌లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఇలా..
మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్‌ చేసుకోండి
అందులో Hi అని మెసేజ్‌ పంపండి
సర్వీస్‌ సెలక్షన్‌ అనే ఆప్షన్‌ వస్తుంది
ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ను ఎంచుకోండి
అక్కడ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోండి
అప్లికేషన్‌ నంబర్‌/చైల్డ్‌ ఐడీతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాలి
రెగ్యులర్‌/ప్రైవేటు/ఓఎస్ఎస్‌సీ రెగ్యులర్‌/ఒకేషనల్‌లలో మీకు సంబంధించిన కేటగిరీని ఎంచుకొని కన్‌ఫర్మ్‌ చేయండి.
ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్‌ మీ వాట్సప్‌ నంబర్‌కే వచ్చేస్తుంది.
డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోండి.
ఇదండీ విషయం.. ఆ పని చేస్తే పిల్లలకు టెన్షన్ తప్పుతుంది.
Tags:    

Similar News