అలిపిరిలో హోమం చేయిస్తారా?.. శ్రీవారి దర్శనం టికెట్లు సిద్ధం

ఆగష్టు నుంచి ఆన్ లైన్ లో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-28 06:42 GMT
అలిపిరి వద్ద ఉన్న సప్త గోప్రదక్షిణ మందిరం (ఫైల్)

అలిపిరి వద్ద టీటీడీ సప్త గోప్రదక్షిణ మందిరం ఏర్పాటు చేసింది. ఇక్కడ హోమం చేయించుకునే దంపతులకు తిరుమల శ్రీవారి దర్శనం ( Tirumala Darsan Tickets )  టికెట్లు అందిస్తారు. ఇక్కడ హోమ పూజలు ( Homw Pooja ) చేయించడానికి అవసరమైన టికెట్లు ఆగష్టు ఒకటో తేదీ నుంచి టీటీడీ ఆన్ లైన్ (TTD Onlone Tickets ) లోనే అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

అలిరి వద్ద ఈ హోమ పూజలు నిర్వహించడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్లే యాత్రికులకు అలిపిరి ముఖద్వారం. ఇక్కడి పాదాల మండపం వద్ద పూజ అనంతరం యాత్రికులు నడక ప్రారంభిస్తారు. అందువల్ల..

2023 నవంబర్ 23న
అలిపిరి వద్ద సప్త గోప్రదక్షిణ క్షేత్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. ఆర్జిత గో పూజ కూడా అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా హోమ పూజలు చేయించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో సామాన్య యాత్రికులు కూడా హోమ పూజలు చేయించుకోవడానికి అలిపిరి వద్ద "శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం" నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

త‌మ ఇళ్లలో శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వ‌హించేలా శ్రీవారి పాదాల వ‌ద్ద‌ టీటీడీ ఏర్పాట్లు చేసింది. రోజూ 200 మంది గృహస్తులు (దంపతులు)హోమం నిర్వహించుకోవడానికి సదుపాయం కల్పించారు. ఉభయ దేవేరుల తోపాటు శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసే వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రోచ్ఛారణలతో హోమం నిర్వహిస్తారు.
ఆగష్టు నుంచి ఆన్ లైన్ టికెట్లు
అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం నిర్వహించడానికి పాల్గొనే భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంచింది. ఒకో టికెట్ రూ.1,600 కొనుగోలు చేసేగా దంపతులను హోమ పూజకు అనుమతిస్తారు. ఇప్పటి వరకు క‌రెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేసేవారు. ఆగష్టు ఒకటో తేదీ నుంచి మొత్తం టికెట్ల ఆన్ లైన్ లో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరెంట్ బుకింగ్ టికెట్లు ఇకపై అలిపిరి వద్ద జారీ చేయరని స్పష్టం చేశారు.
నిబంధనలు
హోమం చేయించడానికి టికెట్లు తీసుకునే గృహస్థులు (భార్యా, భర్త) సంప్రదాయ దుస్తులతో ఉదయం 8.30 గంటలకు రిపోర్ట్ చేయాలి. తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే హోమం వేదపండితులు రెండు గంటల నుంచి రెండు గంటల వరకు నిర్వహిస్తారు.
శ్రీవారి దర్శనం టికెట్లు
అలిపిరి వద్ద "శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం" జరపడానికి ఆన్ లైన్ లో టికెట్లు తీసుకునే దంపతులకు శ్రీవారి దర్శనానికి కూడా సౌలభ్యం ఉంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వీలుగా ఇద్దరికీ ప్రత్యేక దర్శనానికి రూ. 300 టికెట్లు టీటీడీ అధికారులు జారీ చేస్తారు.

Similar News