ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్న పారిశ్రామిక జోన్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళనకరంగా మారాయి. అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక వాడల్లోనే అధికంగా ఈ దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 70 మంది వరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Update: 2024-08-22 06:56 GMT

విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతాలు ప్రమాదాలకు నిలయాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో తక్కిన ప్రాంతాల్లో కంటే విశాఖపట్నం ఏరియాలోనే అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత చరిత్ర చూస్తే ఇదే అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రమాదాలు కాకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత చోటు చేసుకున్న యాక్సిడెంట్లను ఒక సారి పరిశీలిస్తే విశాఖపట్నం పరిశ్రమలు జోన్‌ ప్రమాదాల జోన్‌గా మారిపోందని చెప్పొచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2024 ఆగస్టు 21న బుధవారం చోటు చేసుకన్న అత్యుతాపురం సెజ్‌ ప్రమాదం వరకు దాదాపు 70 మంది వరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరిలో ఆయా పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు ఇంజనీర్‌ కేడర్‌లో ఉన్న అధికారులు కూడా ఉన్నారు.

ఇప్పటి వరకు చోటు చేసుకున్న ప్రమాదాల్లో బుధవారం చోటు చేసుకున్న అత్యుచాపురం సెజ్‌ యాక్సిడెంటే అతి పెద్దది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు పోగొట్టుకోగా, పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత 2020వ సంవత్సరం మే నెల 7వ తేదీన విశాఖపట్నంలో చోటు చేసుకున్న ప్రమాదం అతి పెద్దది. ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఇది చోటు చేసుకుంది. వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్టైరీన్‌ గ్యాస్‌ లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో లీకైన విష వాయులు ఈ కంపెనీకి చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు పాకింది. దీనిని పీల్చడంతో వందాలది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఒక్క సారిగ భయానక వాతావరణం నెలకొనింది. స్థానికులు హడలి పోయారు.
దీని కంటే ముందు షిప్‌ యార్డులో జరిగిన ఘోర ప్రమాదంలో కూడా భారీ సంఖ్యలోనే మృత్యువాత పడ్డారు. ఇది ఆగస్టు 1, 2020న జరిగింది. హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో క్రేన్‌ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఏకంగా 11 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత ఏడాది కూడా అచ్యుతాపురంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మా ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీలో కెమికల్‌ రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు పోగొట్టుకొని విగత జీవులుగా మారారు. జూన్‌ 30, 2023న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే సెచ్‌ ప్రాంతంలో గత నెల జూలైలో కూడా మరో ప్రమాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెజ్‌ పరిధిలోని వసంత్‌ కెమికల్స్‌ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
అచ్యుతాపురం తర్వాత పరవాడ ప్రాంతం కూడా ప్రమాదాలకు నిలయంగానే మారి పోయింది. ఇక్కడ కూడా వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పరవాడ ప్రాంతంలోని విశాఖ ఫార్మాసిటీలో ఇదే ఏడాది ఏప్రిల్‌ నెలలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకోగా, 10 మందికిపైగా గాయాలు పాలయ్యారు. ఇదే పరవాడ ప్రాంతంలోని ఎన్టీపీసీ సింహాద్రి పవర్‌ ప్లాంట్‌లో పైర్‌ యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది. ఆగస్టు 10, 2023న జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరవాడ ప్రాంతంలోని విష్ణు కెమికల్స్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో గతేడాది ఫిబ్రవరి 11న జరిగిన లిక్విడ్‌ స్టీల్‌ కన్వేయర్‌ బెల్ట్‌ ఘటనలో 9 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అంతకంటే ముందు నెల అంటే జనవరిలో అచ్యుతాపురం సెజ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇది కూడా రియాక్టర్‌ పేలడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. జీఎఫ్‌ఎంస్‌ ఫార్మా కంపెనీలో జనవరి 31న జరిగిన ఈ యాక్సిడెంట్‌లో ఒకరు మరణించగా, ముగ్గురు క్షతగాత్రులయ్యారు. అనకాపల్లి జేఎన్‌ ఫార్మాసిటీలో లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబరు 26, 2022న చోటు చేసుకున్న ఫైర్‌ యాక్సిడెంట్‌లో ఐదురుగురు ప్రాణాలు కోల్పోయారు. పరవాడలోని జేఎస్‌పీసీలో స్మైలాక్స్‌ ల్యాబ్స్‌లో లీకైన విషయవాయులను పీల్చడంతో డిసెంబరు 27, 2019న ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో కార్బన్‌ మోనాక్సైడ్‌ లీకేజీతో 2014లో ఇద్దరు ఇంజనీర్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
Tags:    

Similar News