TheFederal Debate | మహిళా బాధితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుతోనే న్యాయం
తిరుపతి నుంచి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' నిర్వహించిన డిబేట్ లో సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-16 05:44 GMT
లైంగిక వేధింపులు, అత్యాచారాల నిరోధానికి చట్టాలు కఠినంగా అమలు చేయాలని పౌర సమాజ హక్కుల కోసం ఉద్యమించే నేతలు అభిప్రాయపడ్డారు. మహిళలు, విద్యార్థినులపై జరిగే ఘటనలపై పోలీసులు పకడ్బందీగా చార్జిషీట్ దాఖలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేశారు.
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం ప్యారంపల్లె వద్ద ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ తో దాడి చేశాడు. అంతటితో ఆగని టీడీపీ నేత కొడుకు గణేష్ కత్తితో కూడా దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. దీనిపై మహిళా, విద్యార్థి సంఘం నాయకులు స్పందించారు. క్షణికావేశం. ప్రేమపేరిట వేధింపులకు గురయ్యే వారికి కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేశారు.
తిరుపతి నుంచి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ఛానల్ డిబేట్ లో ఆయా సంఘాల ప్రతినిధులు ఏమన్నారంటే..
సైకాలజిస్ట్ , ఇంపాక్ట్ (Impact ) సంస్థ రీజనల్ ప్రతినిధి తహసీన్ బేగం మాట్లాడుతూ,
"విద్య సంస్థలు మానసిక వికాస కేంద్రాలుగా మారాలి" అన్నారు. దీనికోసం ప్రతి పాఠశాలలో వ్యక్తిత్వ వికాసం. విద్యార్థినులకు ఆత్మసంరక్షణ కోసం ధైర్యం నింపే ఆలోచనలు రేకెత్తించాలని తహసీన్ బేగం అంటున్నారు.
ఇలాంటి సంఘటనలకు ముందు పిల్లలు తల్లిదండ్రులకు సమస్య చెప్పాలి. తద్వారా జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురానికి చెందిన ఐద్వా ( AIDWA ) రాష్ర్ట కోశాధికారి సావిత్రి అభిప్రాయపడ్డారు.
విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆత్మసంరక్షణ కోసం ప్రత్యేక శిక్షణ అవసరం అని గుంటూరుకు చెందిన ఏఐఎస్ఎఫ్ (All India Studient's Federetion - AISF) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నవ్యశ్రీ అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలు అంటే వివక్ష చూపే ఆలోచనలు మార్చుకోవాలని కూడా ఆ
పిల్లల సమస్యలపై తల్లిదండ్రులు కూడా కన్నేసి ఉంచాలి. అని మదనపల్లె బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డీవీ. రమణ సూచించారు. హత్యాచారాల ఘటనలు జరిగినప్పుడు పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి, దాఖలు చేసే చార్జిషీట్ కీలకం. అని గుర్తు చేశారు. ఈ తరహా అనుకోని అవాంఛనీయ ఘటనల్లో రాజకీయ నేతలు బాధితుల పక్షాన నిలబడాలి. మినహా, నిందితులకు కొమ్ము కాయడం సమంజసం కాదని న్యాయవాది రమణ అభిప్రాయపడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసి, బాధితులకు ఊరట, సమాజానికి మంచి సంకేతం అందించడానికి పోలీసుల దర్యాప్తే కీలకం అని గుర్తు చేశారు.
విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు సాగిస్తున్న తమ సంఘం పక్షాన, విద్యార్థినుల రక్షణ కోసం కూడా కార్యకలాపాలు సాగిస్తామని అనంతపురం జిల్లా నుంచి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్శదర్శిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుళ్లాయిస్వామి స్పష్టం చేశారు.
తిరుపతి నుంచి 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' నిర్వహించిన చర్చలో పాల్గొన్న వారంతా ఇంకా ఏమంటున్నారంటే...