చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల వారణాసి ట్రిప్‌ అందుకేనా ?

ప్రధాని మోదీని మెప్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వారణాసి వెళ్లారు. కూటమి తధ్యమని ప్రధానికి చెప్పారు.

Update: 2024-05-14 11:24 GMT


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు ప్రత్యేక విమానాల్లో వారణాసి వెళ్లారు. ప్రధాని మోదీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరు వారణాసి వెళ్లారు. చంద్రబాబు మంగళవారం ఉదయం వెళ్లగా, పవన్‌ కల్యాణ్‌ సోమవారం రాత్రే అక్కడికి చేరుకున్నారు. పీఎం మోదీ నామినేషన్‌లో పాల్గొనాల్సిందిగా వీరిద్దరికీ ఇది వరకే ఇన్విటేషన్‌లు అందాయి. వారణాసిలో ఆరు కిలోమీటర్ల దూరం జరిగిన రోడ్‌ షోలు ప్రధాన మోదీతో పాటు వీరు కూడా పాల్గొన్నారు. వారణాసిగా భారీగా జనాలను బీజేపీ వర్గాలు తరలించాయి. ప్రధాని శాస్త్రోక్తంగా గంగానదిలో పూజలు చేసిన అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని నామినేషన్‌ కార్యక్రమం కూడా పూర్తి అయింది. ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్‌సభ సీటు సాధించబోతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ఏన్డీఏ కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత దేశం కీలక పాత్ర పోషించనుందని, 2047కు వికసిత భారత్‌ లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తర్వాత ఏపీలో ఎన్డీఏ భాగస్వాములైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు గెలువబోతున్నారనే సంకేతాలతో పీఎంను కలిసి ఇక్కడి పరిస్థితులు వివరించినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో వీరు పాల్గొంటారు. అమిత్‌షా, నడ్డా వంటి నేతలతో ప్రత్యేకంగా మాట్లాడి కేంద్రంలోని మంత్రి వర్గంలో చోటు దక్కించుకునే ప్రయత్నాలు కూడా ఇద్దరూ మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. బీజేపీ ఏపీలో తమకంటూ కొన్ని అసెంబ్లీ సీట్లున్నాయని చెప్పుకునేందుకు కూటమికి కూడా అవకాశం లభించింది. ప్రధాని మంత్రి, బీజేపీ సపోర్టు మాకు పూర్తి స్థాయిలో ఉందని చెప్పుకునేందుకు వారణాసి టూర్‌ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ వ్యవహారంపై నడ్డాతో ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు నూరు శాతం ఎన్డీఏ కూటమికి ఉన్నాయని, జగన్‌ దుడుకు వ్యవహారాన్ని కాస్త కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చర్చించినట్లు తెలిసింది. ప్రధాన మోదీకి అత్యధిక మెజారిటీ తెచ్చే విషయంలో తమ వంతు భాగస్వామ్యం ఉంటుందని ఇరువురు నేతలు హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంన్నారు.
Tags:    

Similar News