'అభినవ హిందూ' అనంత శ్రీరామ్ అంతలా ఎందుకు రెచ్చిపోయారు?

సినీ గేయ రచయిత, అభినవ హైందవ అభిమాని అనంత శ్రీరామ్ ఏదో విధంగా వార్తల్లో ఉండాలని చూస్తారా? అందుకే ఆయన ఈసారి ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా..;

Update: 2025-01-06 04:08 GMT
సినీ గేయ రచయిత, అభినవ హైందవ అభిమాని అనంత శ్రీరామ్ ఏదో విధంగా వార్తల్లో ఉండాలని చూస్తారా? ప్రతిదానిపై ఏదో ఒక వ్యాఖ్య చేసి తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలని తాపత్రయపడతారా? అందుకే ఆయన విజయవాడలో జరిగిన హైందవ శంఖారావంలో అంతలా రెచ్చిపోయారా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు.
దానానికి మారుపేరుగా, దాతగా పేరు ప్రఖ్యాతలున్నదాన వీర శూర కర్ణుడి గొప్పతనాన్ని శంకిస్తూ ఆయన మాట్లాడిన తీరుపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అనంత శ్రీరామ్ కీర్తికాంక్షకి ఇప్పుడు కర్ణుడు కావాల్సి వచ్చారా? అంటూ పలువురు విమర్శలకి లంకించుకున్నారు. కల్కీ సినిమాపై అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను- తనకు అవకాశం దక్కకపోవడం వల్లేనని మరికొందరు నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం అని అన్నారు. యతిప్రాసలు తెలిసినంత మాత్రాన ఆయనేమీ మహాపండితుడై పోడని, ఊళ్లల్లో పిట్టల దొరలు ఇంతకన్నా గొప్పగా పాండిత్యం చెబుతారని విశాఖపట్నానికి చెందిన మహాలక్ష్మీ అని ఓ మహిళ ట్విట్టర్ లో వ్యాఖ్యానించడం గమనార్హం.
సినిమాల్లో కర్ణుడికి గొప్పతనాన్ని ఆపాదించడాన్ని అనంత్ శ్రీరామ్ ఆక్షేపించారు. సినిమాల్లో వినోదం కోసం హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆందోళనం చెందారు. నేరుగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ ఆయన తీసిన ‘దానవీర శూర కర్ణ’ సినిమా నుంచి ప్రభాస్ నటించిన ‘కల్కి’చిత్రంలో కర్ణ పాత్రలను మల్చిన తీరును దుయ్యబట్టారు.
కర్ణుడి గొప్పతనాన్ని ఆధ్యాత్మిక పండితులు గరికపాటి మొదలు చాగంటి వరకు అందరూ ప్రశంసిస్తూ అద్భుత ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో అనంత శ్రీరామ్ కర్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నలుగురి నోళ్లలో నానాలనుకుంటున్నారని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ పండితుడు అభిప్రాయపడ్డారు.
ఇంతకీ అనంత శ్రీరామ్ ఏమన్నారు?
విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమాల చిత్రీకరణ, వక్రీకరణ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమాలు మన పురాణ, ఇతిహాస గాథల్ని వక్రీకరిస్తున్నారని మండి పడ్డాడు. పాటలు, సన్నివేశాలు ఇలా అన్ని రకాలుగా హననం చేస్తున్నారంటూ కొన్ని ఉదాహరణలు చెప్పాడు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హీరోగా చూపించడం సిగ్గు చేటున్నారు. కర్ణుడ్ని వీరుడు, శూరుడు అంటూ చూపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నిండు సభలో ద్రౌపదిని వివస్త్రను చేయమన్నవాడు శూరుడు, వీరుడు అవుతాడా? గంధర్వులతో యుద్ద సమయంలో పారిపోయిన వాడ్ని శూరుడు, వీరుడు అంటామా? అంటూ అనంత శ్రీరామ్ ఏవేవో చెప్పుకొచ్చారు. పాటల్లోనూ పదే పదే మన హైందవ ధర్మాన్ని కించ పరుస్తూనే వస్తున్నారన్నాడు. ధమ్ అరే ధమ్.. హరే కృష్ణ హరే హరే రామ్. అంటూ ఓ ఐటం పాటలో ఇస్కాన్ వారి నినాదాన్ని వాడారు అన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి హరే రామ హరే కృష్ణ.. అంటూ అద్భుతంగా రాశారు. పాట అంటే అలా రాయాలి.. పాట ద్వారా మార్పు తీసుకు రావడం అంటే అలా రాయాలి అంటూ అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు. అన్య మతస్థులు తెర వెనుక మన హైందవ ధర్మాన్ని ఎలా అణచి వేస్తున్నారో ఓ ఘటన చెబుతానంటూ తనకు జరిగిన విషయాన్ని బయట పెట్టేశాడు అనంత శ్రీరామ్.
నేను రాసిన ఓ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని చెప్పి.. ఆ పాటను చేయనని చెప్పాడు.. ఒక్క హిందూ పదం ఉందని చెప్పి నువ్వు పాట చేయనని చెప్పావ్.. జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకీ నేను రాయను అని ప్రతిజ్ఞ.. 15 ఏళ్లుగా అతనికి ఒక్క పాట రాయకుండా ఉండిపోయా అని అన్నాడు. ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా? అని నెట్టింట్లో తెగ చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది అనూప్ రూబెన్సా? హారస్ జైయరాజా?అంటూ ఇలా చాలా పేర్లను చర్చల్లో చెప్పుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో.. అనంత శ్రీరామ్‌కే తెలియాలి.
అయితే కొందరు విమర్శకులు చెప్పేదాని ప్రకారం.. అనంత్ శ్రీరామ్ టార్గెట్ చేసింది ఎన్టీఆర్ తీసిన దాన వీర శూర కర్ణ సినిమాను కాదని, కొందరు పండితులుగా చెలామణి అవుతున్న సినీ కవులు, గేయరచయితలు ఆయన ప్రతిభను గుర్తించకపోవడమే కాణమని.. చెబుతున్నారు.
Tags:    

Similar News