చింతలపూడిలో వైసీపీ ఓటమే లక్ష్యమా!

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వైఎస్సార్‌సీపీ యు ఎలిజా ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు.

Update: 2024-03-24 11:34 GMT
ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీసీ ఎమ్మెల్యే ఎలిజా

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు పూటకో రంగు మారుతున్నాయి. సీట్లు రాని శ్రీమ్మెల్యేలు వెంటనే రంగులు మారుస్తున్నారు. తనకు సీటు ఇవ్వని పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు ముందుకు సాగుతుండటం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు ముక్కలాట సాగింది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఈ ఆటకు తెరపడింది. ఆటాడుకుంటూ ముందుకు సాగటం కంటే ఆటకట్టించి ముందుకు సాగటం మంచిదని చాలా మంది అభ్యర్థులు భావిస్తున్నారు.

ఎలిజాకు టిక్కెట్‌ ఇవ్వని వైఎస్సార్‌సీపీ
చింతలపూడి నియోజకవర్గానికి ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ శ్రీమ్మెల్యేగా ఉన్నమట్ల ఎలిజా ఉన్నారు. ఆయనకు ఈసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిక్కెట్‌ ఇవ్వలేదు. ఎన్నో కారణాలు, ఈక్వేషన్స్‌ ఉండవచ్చు. ఎలిజా గత ఎన్నికల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి పోటీ చేసి గెలుపొందారు. ఈయన ఐఆర్‌ఎస్‌ అధికారి. డబ్బు సంపాదనలోనూ దిట్టే కావడంతో సీటు సంపాదించి గెలుపు సాధించారు. రానున్న ఎన్నికల్లో మీరు చింతలపూడి నుంచి గెలిచే అవకాశం లేదు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని ఎలిజాను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఎంపీ అభ్యర్థి అంటే ఆషామాషీ కాదుకదా.. కనీసం 50 కోట్లయినా ఉండాలి. ఒక్కో నియోజకవర్గానికి ఎంత తక్కువ అనిపించినా ఐదు కోట్ల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వుంటుంది. అంతమొత్తం డబ్బలు పెట్టలేనందున ఎంపీగా పోటీ చేసేందుకు ఎలిజా అంగీకరించలేదు. దీంతో ఆయనను పక్కన బెట్టారు. చింతలపూడి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శాసన మండలి అధ్యక్షుడు మోషేన్‌రాజు వియ్యంకుడైన కంభంపాటి విజయరాజును ప్రకటించారు. ఈయన మోటార్‌ టాన్స్‌పోర్టు ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో ఉన్నారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. విజయరాజును నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించిన తరువాత ఇక ఉండటం అనవసరమని భావించిన ఎలిజా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్‌ను ఎందుకు ఎంచుకున్నట్లు..
కాంగ్రెస్‌ పార్టీ వారితో మాట్లాడి వారు చింతలపూడి అభ్యర్థిగా టిక్కెట్‌ ఇస్తమని మాట ఇచ్చిన తరువత కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌కు ఓటింగ్‌ శాతం ఈ సారి తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ బాధ్యతలు తీసుకున్నందున ఆమెపై నమ్మకంతో చాలా మంది పార్టీకి ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మధ్య తాను పోటీ చేస్తే నేను అనుకున్న వ్యక్తిని ఓడించేందుకు అవకాశం వుంటుందని భావించిన ఎలిజా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తాను మాత్రం కాంగ్రెస్‌ జాతీయ పార్టీ కావడం, లౌకికత్వానికి కట్టుబడి ఉన్నందున చేరుతున్నట్లు ప్రకటించారు.
శ్రీధర్‌ ఎందుకు వెనక్కి తగ్గారు..
ఏలూరు పార్లమెంట్‌ సభ్యులు కోటగిరి శ్రీధర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కారణాలు ఏవైనా వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వలేదు. సీనియర్‌ రాజకీయ నాయకుడైన కోటగిరి విద్యాధరరావు కుమారుడు. ఖర్చుకు భయపడ్డాడని, పైగా రాజకీయలు విసుగు తెప్పిస్తున్నందున తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ముందుగానే ప్రకటించారు. దీంతో రంగంలోకి కారుమూరి సునీల్‌ యాదవ్‌ రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరావు కుమారుడు సునీల్‌. ఇప్పటి వరకు ఎలిజాకు, ఎంపీ శ్రీధర్‌కు సరిపడలేదు. అందువల్లే ఎలిజా తప్పుకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని చెప్పేందుకు శ్రీధర్‌కూడా నిరూపించారు. ∙
Tags:    

Similar News