చంద్రబాబు, జగన్‌ల నేటి షెడ్యూల్ ఇదే!

రాష్ట్రంలని పార్టీలన్నీ ఎన్నికల పరచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, సీఎం జగన్ మోహన్ రెడ్డి నేటి షెడ్యూల్ ఇదే..

Update: 2024-04-04 06:45 GMT
Source: Twitter

ఆంధ్రలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వా నేనా అన్న విధంగా ఎండను కూడా లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా నేతుల ప్రసంగాలిస్తున్నారు. ఒకవైపు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దూసుకుపోతుంటే మరోవైపు ‘ప్రజాగళం’ అంటూ చంద్రబాబు దూకుడు కనపబరుస్తున్నారు. తమ ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజలతో మమేకం కావడానికి వీరు ఎంతో కృషి చేస్తున్నారు. వీరితో పాటు ‘వారాహి విజయయాత్రతో’ జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంతో తన మార్క్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రధాన నేతలంతా తమ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఎవరి యాత్ర ఎలా సాగునుందంటే..

జగన్ షెడ్యూల్ ఇదే
‘మేమంతా సిద్ధం’ యాత్ర ఎనిమిదవ రోజున జగన్ చాలా బిజీ షెడ్యూల్ గడపనున్నారు. ‘‘నిన్నసింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో సమావేశం కానున్నారు. వారితో వారికి అందుతున్న పథకాలపై చర్చిస్తారు. ఆ తర్వాత ఏర్పేడు మండలంలోని ఇసుక తాగేలి దగ్గర మహిళలతో మాట్లాడతారు. ఈ రోజు సుమారు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీఎం జగన్.. ఏర్పేడు చేరుకోనున్నారు. అక్కడే తన ఎనిమిదవ రోజు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి గ్రామస్తులంతా సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం 3 గంటలకు ఆయన శ్రీకాళహస్తి చేరుకుంటారు. అక్కడ నాయుడు పేట బైపాల్ మీదుగా చింతరెడ్డి పాలెం దగ్గర ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించి బహిరంగ సభలో కూడా జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
చంద్రబాబు షెడ్యూ ఇలా
ఇక ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు విసయానికి వస్తే ఆయన కూడా ప్రజాగళం పేరిట ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తు సాధిస్తున్నారు. ‘‘ఈరోజు యాత్ర నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి మొదలు కానుంది. మధ్యాహ్నం మూడు గంటల బాబు.. కొవ్వూరు చేరుకుంటారు. చాగల్లు రోడ్డు నుంచి విజయ విహార్ సెంటర్ వరకు నిర్వహించనున్ నరోడ్‌ షోలో బాబు ప్రత్యేకంగా నిలనున్నారు. ఆ తర్వాత అనంతపురంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడతారు’’. అయితే రానున్న ఎన్నికల్లో విజయం సమదే వణిస్తుందని టీడీపీ శ్రేణులు ధీమా ఉన్నాయి.
పవన్ షెడ్యూల్‌పై ఇంకా గందరగోళం
జనసేనా పవన్ కల్యాణ్ నేటి షెడ్యూల్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. బుధవారం తీవ్ర జ్వరంతో అస్వస్థకు గురైనా పవన్‌ను పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన షెడ్యూల్ అంతా తారుమారైంది. దీని విషయంలో ఏర్పడిన గందరగోళం ఇంకా వీడలేదు. కానీ అతి త్వరలోనే జవన్ కల్యాణ్ సింహనాదం చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతారని జనసేన పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.


Tags:    

Similar News