'చంద్రబాబూ నువ్వు నేరుగా నరకానికే పోతావ్!'
ఏంటి జగన్, చంద్రబాబును అంత మాట అనేశావ్?;
By : The Federal
Update: 2025-08-13 11:32 GMT
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన దౌర్జన్యాలు, ఓట్ల గల్లంతు, రిగ్గింగు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై బుధవారం (ఆగస్టు 13)న మీడియాతో మాట్లాడిన జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, జీవిత చరమాంకంలోనైనా బుద్ధితెచ్చుకుని కృష్ణారామా అంటూ బతకాలంటూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జగన్ మాట్లాడుతూ ఇలా అన్నారు.
"ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇదే ఆఖరి ఎలక్షన్ కావొచ్చు. కృష్ణారామా అనుకునే ఈ వయసులో కనీసం ఆమాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తది, ఈ మాదిరిగా చేస్తే నువ్వు నరకానికే పోతావు, ఇప్పటికైనా మార్పుతెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా" అని జగన్ అన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. తెలుగుదేశం పార్టీ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. జగన్ నోటికి అద్దూ ఆపూ లేకుండా పోయిందని టీటీడీ నాయకుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఇదే తరహాలో టీటీడీ నేతలు వైసీపీ అధినేత జగన్ పై మండిపడుతున్నారు.