జగన్‌ సరస్వతీ పవర్‌ కేసు విచారణ వాయిదా

షేర్ల విషయమై ఇది వరకే జగన్‌ కోర్టును ఆశ్రయించారు. తల్లి, చెల్లిని ప్రతివాదులుగా పేర్కొంటూ పిటీషన్‌ దాఖలు చేశారు.

Update: 2024-11-08 09:24 GMT

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సరస్వతీ పవర్‌ ప్లాంట్ కేసులో జగన్‌ పిటీషన్‌ మీద శుక్రవారం విచారణ జరిగింది. హైదరాబాద్‌లోని నేషనల్‌ లా ట్రిబ్యునల్‌లో దీనిపై విచారణ చేపట్టారు. విచాణ సందర్భంగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను కోరింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరపున న్యాయవాది కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో విచారణను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ కోర్టు డిసెంబరు 13వ తేదీకి వాయిదా వేసింది. సరస్వతీ పవన్‌ కంపెనీలో షేర్ల బదిలీపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన జగన్‌ ఇది వరకే అందులో పిటీషన్‌ దాఖలు చేశారు. తనకు తెలియకుండా తన తల్లి విజయమ్మ, తన సోదరి షర్మిల అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. తన తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను ఆ పిటీషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. షేర్ల బదిలీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫారాలు వంటివి ఏమీ సమర్పించకుండానే తమ పేర్ల మీదకు షేర్లను బదిలీ చేసుకున్నారని పిటీషన్‌లో కోర్టుకు వివరించారు. జగన్, భారతి, క్లాసిక్‌ రియాలిటీ పేరిట షేర్లు కొనసాగేలా చూడాలని, 51.01 శాతం షేర్లను యథావిధిగా తనకు కొనసాగేలా ఆదేశాలు జారీ చేయాలని జగన్‌ తన పిటీషన్‌లో కోర్టును కోరారు.

Tags:    

Similar News