Jahan v/s CBN | పులివెందులపై టీడీపీ జెండా

టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే.. ఆమె భర్త బీటెక్ రవి రియాక్షన్;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-14 07:58 GMT
రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రం అందుకుంటున్న పులివెందుల జెడ్పీటీసీ సభ్యురాలు లతారెడ్డి

పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టనికోటగా నిలిచింది. 1972 నుంచి దివంగత సీఎం వైఎస్ఆర్, ఆయన కుటుంబీకులదే రాజకీయ ఆధిపత్యం.

జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్న టీడీపీ పులివెందులలో పాగా వేయడానికి సర్వశక్తులు ఒడ్డింది. ఇక్కడి నుంచి మాజీ ఎంఎల్సీ బీ.టెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి 6,716 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి లతారెడ్డి ధృవపత్రం అందుకున్నారు.
పులివెందులో వైఎస్ఆర్ కుటుంబ ఏకపక్ష ధోరణికి ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పారు. అని ఈ ఎన్నికల విజయంపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీ.టెక్ రవి కొద్దిసేపటి కిందట కడపలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
"వైఎస్ఆర్ కుటుంబం సాగించిన పెత్తనానికి చెక్ పెట్టాం" అని బీ.టెక్ రవి అన్నారు.
వైఎస్. జగన్ తీరుతో విసిగిపోయిన వైసీపీ నేతలు బయటికి వచ్చారు. కొందరు నేతలను చూపిస్తూ, వీరంతా వైసీపీ నుంచి వచ్చిన వారే అని చెప్పారు.
"కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే వైఎస్. జగన్ ఇంకా ఆకాశంలో ఉన్నారు. వారి తీరు వల్లే మాకు అవకాశం దక్కింది" అని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. ఈ ఉత్సాహంతోనే ప్రజలకు మరింత చేరువ కావడం ద్వారా పులివెందులలో మళ్లీ పట్టు సాధించే కసరత్తు ఉంటుందని ఆయన వివరించారు.

పులివెందుల జెడ్పీటీసీ స్థానం
మొత్తం ఓట్లు 10,601
పోలైనవి 7,800
టీడీపీ అభ్యర్థి లతా రెడ్డికి దక్కింన ఓట్లు 6,716
వైసీపీ అభ్యర్థి తురకా హేమంతరెడ్డికి 683 ఓట్లు దక్కాయి.
టీడీపీ మెజారిటీ 6,033 ఓట్లు దక్కాయి.


Tags:    

Similar News