ఏపీకి పొంచి ఉన్న వరద ప్రమాదం.. అధికారులకు సహకరించమన్న జనసేన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

Update: 2024-07-20 08:11 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎప్పుడైనా జనావాసాలు ముంచడానికి సిద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఇదే విధంగా ఇతర జిల్లాల్లో కూడా వర్షాల వల్ల ఏర్పాడిన స్థితిగతులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటూ ఆస్తి, ప్రాణ నష్టం కలుగుకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశాలిచ్చింది. ప్రతి జిల్లాలో షెల్టర్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంటలు కూడా నీట మునికి రైతులకు ఇబ్బందిగా మారింది.

పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం కూడా పెరిగి ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తుంది. దీనికి చెక్ పెట్టడానికి డ్యామ్‌ల యాజమాన్యం వందల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నాయి. వీటితోపాటుగా వర్షాలు మరింద ఉదృతం కానున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు కూడా చేపట్టనున్నామని అధికారులు వివరిస్తున్నారు. పలు ఇతర జిల్లాల్లో ఈ వర్షాల వల్ల విహారా యాత్రలు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినాయకత్వం కూడా పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరద సంబంధిత సహాయక చర్యల్లో అధికారులకు పూర్తి సహకారం అందించాలని జనసేన అధినాయకత్వం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై సహాయక చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని జనసేన నాయకులు, శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తాగు నీరు, ఔషధాలు, ఆహారం అందించగలరు. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను అప్రమత్తం చేయడంలోను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించడంలోను తోడ్పాటు ఇవ్వగలరు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే నాగబాబు చెప్పారు.

Tags:    

Similar News