ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ విగ్రహాలు తయారీ ..!

Update: 2024-03-17 08:16 GMT


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలను తయారు చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణలోని అభిమాన‌గ‌ణం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.అయితే అభిమానులు పోస్ట్ చేశారో లేక తయారీదారులు పోస్ట్ చేశారో తెలీదు కానీ. ప్రస్తుతం కేసీఆర్ విగ్రహాల త‌యారీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట‌ బాగా వైర‌ల్ అవుతున్నాయి.ఈ విగ్రహాలు కొత్త పాతవో తెలియదు. కూతురు కవిత అరెస్టుతో కెసిఆర్ మళ్లీ వార్తల్లోకెక్కారు. కూతురి అరెస్టు మీద ఆయన ఇంతవరకు ఒక్క కామెంట్ చేయలేదు. దీనితో ఆయన మౌనం చర్చనీయాంశంమయింది. ఈ నేపథ్యంలో ఈ విగ్రహాలు సోషల్ మీడియా లోె ప్రత్యక్ష మయ్యాయి. ఇందులో కొత్తేమి ఉంద‌నేగా మీ అనుమానం. ఆ విగ్ర‌హాలు తెలంగాణ‌లో త‌యార‌యితే ప‌ర్లేదు. కానీ, అవి త‌యారవుతుంది ప‌క్క రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో. అందుకే వాటి తాలూకు ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.


Tags:    

Similar News