రౌడీషీటర్లను పెంచిపోషించిందే ఎమ్మెల్యే కోటంరెడ్డి కాదా?

కోటంరెడ్డి.. నీ వేషాలు ఆపయ్యా! అని మాజీ మంత్రి కాకాణి ఎదురుదాడి;

Update: 2025-08-30 10:40 GMT
నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రౌడీలను పెంచి పోషించింది నువ్వంటే నువ్వని ఓనాటి సహచరులు, ప్రస్తుత ప్రత్యర్థులు పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటున్నారు. తనను హత మార్చేందుకు కొందరు రౌడీషీటర్లు కుట్రపన్నారని, దాని వెనుక వైసీపీ వాళ్లు ఉన్నారనే అర్థంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అంటుంటే ఇక ఈ డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఆపయ్యా అంటున్నారు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
కాకాణి ఏమన్నారంటే...
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఆగస్టు 30న మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...జీవితఖైదు అనుభవిస్తున్న రౌడీషీటర్ శ్రీకాంత్ కి బెయిల్ ఎవరు ఇప్పించారు.. ప్రస్తుత హోంమంత్రి సంతకం లేకుండానే పెరోల్ వచ్చిందా అని ప్రశ్నించారు. తెర వెనుక ఏమి జరిగిందో ఇప్పుడు అతడు మళ్లీ జైల్ కి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామాలకు తెరతీశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు రౌడీ షీటర్లు కుట్ర పన్నారని ప్రచారం చేస్తున్నారు.. అసలు నెల్లూరులో రౌడీ షీటర్స్‌, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాదా? ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి కోటంరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.

‘నెల్లూరులో అనేక‌‌ నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. క్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డిపై స్కెచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. హత్యా రాజకీయాలు‌ మేము ప్రోత్సహించం. శ్రీధర్ రెడ్డి మొదట ఎమ్మెల్యే అవ్వడానికి కారణం వైఎస్‌ జగన్‌. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పనులు చేయకూడదు. నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కోటంరెడ్డి. నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి కాదా!. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నెల్లూరులో రౌడీ కల్చర్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, కోటంరెడ్డి. పెరోల్‌పై హోంమంత్రి సంతకం పెట్టింది నిజం కాదా?. ఏం తీసుకొని, ఎవరు ప్రలోభంతో హోంమంత్రి పెరోల్ సంతకం చేశారు. పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా?
నేడు నీపై హత్యాయత్నం ప్లాన్ చేసిన వ్యక్తులు నీ అనుచరులు కాదా!. మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా వదిలిపెట్టలేదు. నాడు కోటంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోమన్నారు జగన్. నేడు సంబంధం లేని వ్యక్తులపై కక్ష్య సాధింపు కేసులు‌ నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. పోలీసులు వైఫల్యం చెందారు. నెల్లూరు ఎస్పీ అసమర్థుడు. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే పెరోల్ మంజూరు విషయం, హత్యాయత్నాలు విషయాలపై సీబీఐ విచారణ వేయాలి. శ్రీధర్ రెడ్డి నీ ప్రవర్తన సరికాదు. వైఎస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించే పరిస్థితులు ఉండవు జాగ్రత్త అని హెచ్చరించారు.
రౌడీషీటర్లకు పెరోల్ ఇచ్చే పరిస్థితులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉండేవి కావని, ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యం చేసినందుకు సాక్షాత్తు సొంత ఎమ్మెల్యే పైన్నే చర్య తీసుకున్న చరిత్ర తమదని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
Tags:    

Similar News