Road Terror | కర్నూలు: బస్సు ఢీాకొని నలుగురి మృతి
ఆదోని వద్ద ఈ ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-11 09:02 GMT
ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారిని ఆర్టీసీ అధిగమించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అదే సమయంలో కర్ణాటక బస్సు స్టీరిండ్ రాడ్ ఊడిపోయినట్లు తెలిసింది. దీంతో అదుపుతప్పిన బస్సు రెండు బైక్ లపై వెళుతున్న వారిపై దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికి అక్కడే మరణించారు. వారిలో ఉ గర్భణి కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స తీసుకుంటూ మరణించారని సమాచారం. ఘటనా స్థలాన్ని ఆదోని డీఎస్పీ హేమలత పరిశీలించారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలిమంచి గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. ప్రాథమిక సమచారం మేరకు ఆ వివరాలివి,
కర్ణాటక రాష్ట్రం గంగావతి నుంచి ఆదోని మీదుగా రాయచూరు ( Raichur )కు KA 37F 0711 నంబర్ కేఎస్ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఆ బస్సు జాలిమంచి గ్రామం వద్ద ప్రయాణిస్తుండగా ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాల్లో నలుగురు వెళుతున్నారు. వారిని ఓవర్ టేక్ చేయడానికి బస్సు డ్రైవర్ ప్రయత్నించినట్లు ప్రత్యక్ష్యసాక్షుల కథనం.
ఆ సమయంలో బస్సు స్టీరింగ్ రాడ్ ఊడడం వల్ల అదుపుతప్పి, బైక్ పై ప్రయాణిస్తున్న వారిపైకి దూసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో రెండు ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తున్న నలుగురు బస్సు టైర్ల కింద నలిగిపోయి, ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మాన్వి గ్రామానికి చెందిన హోంగార్డు పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అతనిని ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ( Adoni Government General Hospital) కి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలినట్లు సమాచారం.
బస్సు ఢీకొనడంతో మరణించిన నలుగురిని పోలీసులు గుర్తించారు. మృతులు కొప్పల్ గ్రామానికి చెందిన దంపతులు ఈరన్న, ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఈమె నిండిగర్భిణి అని సమాచారం. ఈ ప్రమాదంలోనే మాన్వి గ్రామానికి చెందిన హేమాద్రి భార్య నాగరత్నమ్మ, కుమారుడు దేవరాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆదోని సమీపంలోని పెద్దతుంబళం పోలీసులు కేసు చేశారు.