అండర్ వాటర్ డ్రోన్ తయారు చేసిన IIIT-DM కర్నూలు శాస్త్రవేత్తలు
నీళ్లలో దేన్నైనా వెదికే సామర్థ్యం ఈ డ్రోన్ ఇండియాలో ఒక సాంకేతిక విప్లవమే...;
ఇంతవరకు గాలిలో ఎగిరే డ్రోన్ లనే చూశాం. పెళ్లి ఫోటోలు తీయడం దగ్గిర నుంచి యుద్ధాల్లో బాంబులు వేసేదాకా డ్రోన్ లను ప్రయోగిస్తున్నారు. అయితే, నీళ్లలోతుల్లో, సుముద్రపు, రిజార్వాయర్ లోతుల్లో తిరిగి మూలమూలలా గాలించే డ్రోన్ ల గురించి మనం ఎపుడు వినలేదు. అది మన కళ్ల ముందుకు రాబోతున్నది. ఈ డ్రోన్ తయారయితే అది ఎన్ని విధాల ఉపయోగపడుతుందో చెప్పలేం. సముద్రాల్లో కూలిపోయినవిమాన శకలాలను కూడా వెతకవచ్చు. నదుల్లో , రిజర్వాయర్లలో పడిపోయిన వాటిని వెతక వచ్చు. నౌకల కిందలోపాలను కనిపెట్టవచ్చు. నీళ్లలోపల ఆనకట్టు లోపాలను, పరిశీలించవచ్చు. ఇలా నీళ్లమునిగివున్న ఏ నిర్మాణాన్నయినా పరిశీలించే మన సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇలాంటి అండర వాటర్ డ్రోన్ ఎక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్, కర్నూలు ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (Indian Institute of Information Technology Design and Manufacturing Kurnool,IIITDM) శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఫ్రొఫెసర్ డాక్టర్ కె కృష్ణ నాయక్