‘చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్లడం పక్కా’.. ప్రచారంలో లక్ష్మీ పార్వతి

చంద్రబాబు, లోకేష్‌లపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ అరెస్ట్ కావడం ఖాయమన్నారు. పేదల సంక్షేమం జగన్‌తోనే సాధ్యమన్నారు.

Update: 2024-05-05 11:58 GMT

‘చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయం’ అంటూ లక్ష్మీ పార్వతి చేసి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మంగళగిరి రాజకీయాల్లోకి లోకేష్ ఎంట్రీతో హత్యారాజకీలు అధికమైపోయాయని ఆమె ఆరోపించారు. జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు లక్ష్మీ పార్వతి. ఆమె ఎంట్రీతో ఆంధ్ర ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. మంగళగిరి సీటుకు వైసీపీ తరపున పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య తరపున లక్ష్మీ పార్వతి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా తాడేపల్లి నులకపేట, ప్రకాష్ నగర్ కాలనీల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. హింసారాజకీయాలు చంద్రబాబు, లోకేష్ డీఎన్‌ఏలో ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.

ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ పాత్ర కీలకం

టీడీపీ హయాంలో రాష్ట్రంలో అనేక అక్రమాలు జరిగాయని లక్ష్మీ పార్వతి విమర్శించారు. లోకేష్ ఎంట్రీతో మంగళగిరిలో హత్య రాజకీయాలు అధికమయ్యాయని, అందుకు వెంకటరెడ్డి హత్య నిలువెత్తు నిదర్శమని ఆరోపించారు. రాజధాని భూములు, ఔటర్ రింగ్ రోడ్డు కేసుల్లో లోకేష్, అప్పటి మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు పాత్ర కీలకమని, అంతేకాకుండా పవర్ గ్రిడ్ కేసులో కూడా లోకేష్ పాత్ర అత్యంత కీలకమని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత తండ్రీకొడుకు ఇద్దరూ (చంద్రబాబు, లోకేష్) జైలుకు వెళ్లడం తథ్యమంటూ జోస్యం చెప్పారు. అవినీతి, దుర్మార్గానికి చంద్రబాబు పర్యాయపదం లాంటి వారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు దారే అడ్డదారి

ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు అంటేనే ఒక దుర్మార్గం, ఒక అబద్దం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దారే అడ్డదారి అంటూ మండిపడ్డారు. ‘‘చంద్రబాబు అంటేనే ఒక అవినీతి. చంద్రబాబు అంటేనే ఒక నీచత్వం. అధికారం, ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డదార్లు ఎన్ని ఉంటే అన్నిటినీ చంద్రబాబు చూస్తారు. అవే తన పరమావధిగా వెళ్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. అందుకే ఆయన వరుస అబద్దాలే చెప్తున్నారు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే మరో అబద్దాన్ని పట్టుకొచ్చారు’’ అని విమర్శలు గుప్పించారు.

‘‘జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పేదల అభివృద్ధి మొదలైంది. పేదల ప్రజల కోసం జగన్ రూ.2 లక్షల 70 వేల కోట్లు వెచ్చించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్. లోకేష్ కూడా తన తండ్రి మాదిరిగానే అత్యంత దుర్మార్గుడు. లోకేష్ లాంటి అవినీతిపరుడికి, అజ్ఞానికి, అహంకారికి మంగళగిరి ప్రజలు ఎవరూ కూడా ఓటేయొద్దని ప్రార్థిస్తున్నా.. మంగళగిరిలోని అన్ని భూములను చంద్రబాబు, లోకేష్ కలిసి కబ్జా చేశారు. ఈ ఎన్నికల తర్వాత తండ్రికొడుకులిద్దరూ జైలుకు పోవడం అనేది వాస్తవం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News