కోనో కార్పస్ వృక్షాల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యం

ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి గురి అవుతున్న కోనో కార్పస్ మొక్కలను రక్షించాలని నరికివేతను ఆపాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కోరారు.

Update: 2024-08-24 09:33 GMT

ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి గురి అవుతున్న కోనో కార్పస్ మొక్కలను రక్షించాలని నరికివేతను ఆపాలని కోరుతూ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ బొటని ప్రొఫెసర్ కె. బయ్యపురెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయ పూర్వ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గౌరవ ప్రొఫెసర్ పర్యావరణ వేత్త ఎ. రామచంద్రా రెడ్డిలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పిల్‌ను స్వీకరించి 137-2024 నెంబర్‌ను కేటాయించడమైనది. జాతీయస్థాయి శాస్త్రవేత్తలతో, నిపుణులతో కమిటీ వేసి అధ్యయన నివేదికలను తెప్పించుకునే వరకు కోనో కార్పస్ చెట్లను నరకడంపై స్టే విధించాలని కోరారు. అశాస్త్రీయంగా అభూత కల్పనలతో విష ప్రచారం చేస్తూ బహుళ ప్రయోజనాలు గల కోనో కార్పస్ చెట్లను తొలగించిన వారిని గుర్తించి, వాల్టా చట్టం ప్రకారం నష్టపరిహారం వసూలు చేయాలని ప్రత్యామ్నాయంగా మొక్కలను నాటించే విధంగా ఆదేశించాలని కోరారు.

దాదాపు 40 దేశాలలో కోనో కార్పస్ వృక్షాలు కొనసాగుతున్నాయని ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు 40 లక్షల కోనో కార్పస్ మొక్కలు పెరిగి పెద్దవై పచ్చదనాన్ని అందిస్తున్నాయని తెలిపారు. అన్ని నేలల్లో ఈ మొక్క బ్రతుకుతుందని, వేగంగా పెరుగుతుందని, ధ్వని కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని నివారిస్తుందని ఇలాంటి బహుళ ప్రయోజనాలను అందిస్తున్న వృక్షాలను ధ్వంసం చేయుట దుర్మార్గం అని అఫీడవిట్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోనో కార్పస్ చెట్ల నరికి వేతపై స్టే విధించాలని కోరారు.

ప్రజాప్రయోజన వ్యాజ్యంలో నోటీసులను చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పర్యావరణ, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీశాఖ సెక్రటరి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కాకినాడ మరియు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్లకు పంపడం జరిగిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News