CM Chandrababu | ఐటీతో ఉద్యానం, వ్యవసాయం అనుసంధానం
ఐటి నైపుణ్యంతో యువత వన్నె తెచ్చారు. రతనాలసీమగా మార్చడానికి ఆ మూడు రంగాలను అనుసంధానం చేస్తానని సీఎం ప్రకటించారు.;
రాయలసీమలో ఉద్యానపంటలకు పుట్టినిల్లు. దీనిని మరింత ఆదాయ వనరుగా మార్చుకోవాలి. దీనికోసం ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చడానికి ఉద్యానవనహబ్ తీర్చిదిద్దడం ద్వారా ప్రధాన ఆదాయ వనరుగా అభివృద్ధి చేస్తాం" అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంతంలో కూరగాయలు సాగు చేసే రైతులు అధికంగా ఉన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేక అనేక మంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర ఇవ్వడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు చెప్పారు. మూడు రంగాలను అనుసంధానంతో ఉత్పత్తి, మార్కెటింగ్ తద్వారా గిట్టుబాటు ధరకు ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో శనివారం ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. కొందరికి ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశారు. గ్రామంలో సోలార్ ప్యానెల్లు అమర్చిన ఇళ్ల వద్దకు పరిశీలించారు. రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత అయిదేళ్లు కష్టాలు ఆరు నెలల్లో అధిగమించేందుకు మార్గదర్శకాలను తయారు చేసి, అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.