సిట్ విచారణకు హాజరైన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్
ఏపీ లిక్కర్ స్కాంలో శ్రవణ్ రావును ఎందుకు విచారిస్తున్నారంటే..;
By : The Federal
Update: 2025-07-24 10:30 GMT
మద్యం కుంభకోణం కేసులో శ్రవణ్‌రావు july 24న విజయవాడలో సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్‌లో ఈయనకు ఏమి సంబంధం లేకపోయినా నిందితులకు దుబాయ్ లో ఆశ్రయం కల్పించారనే దానిపై విచారించేందుకు ఆయన్ను సిట్ విచారణకు పిలిపించింది. లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్న చాణక్యతో పాటు మరికొందరికి దుబాయ్‌లోని తన ఫ్లాట్‌లో ఆశ్రయం కల్పించారనేది ఆయనపై ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో ఏ1 గా ఉన్న రాజ్‌కెసిరెడ్డితో ఆయనకి ఉన్న సంబంధాలపై ఆరాతీసే అవకాశముంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ శ్రవణ్‌రావు నిందితునిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనలో జరిగినట్టు చెబుతున్న3,200 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తులో ఇదో సంచలన మలుపు.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) దర్యాప్తు ప్రకారం-- లిక్కర్ స్కాంలో కీలక నిందితులలో కొందరు దుబాయ్‌లోని హైఎండ్ అపార్ట్‌మెంట్‌లో తలదాచుకున్నట్లు తెలిసింది. ఈ అపార్ట్‌మెంట్ టెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎ. శ్రవణ్ రావుకు చెందిందని సమాచారం.
వెలుగులోకి వచ్చిన ఈ సమాచారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జరుగుతున్న రెండు భారీ స్థాయి క్రిమినల్ దర్యాప్తుల మధ్య లోతైన అనుబంధాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ ఈ రెండు కేసుల్లోనూ నిందితులకు ఉమ్మడి కేంద్రంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, దుబాయ్‌లో శ్రవణ్ రావుకి సొంత లగ్జరీ ఫ్లాట్ ఉంది. దీని అద్దె నెలకు సుమారు రూ.5 లక్షలు. ఈ ఫ్లాట్‌ను లిక్కర్ స్కాం నిందితులు కిరణ్ కుమార్, చాణక్య తదితరులు వాడుకున్నారు.
కిరణ్ కుమార్ లిక్కర్ స్కాం దర్యాప్తు ప్రారంభమైన నాటి నుంచి కనీసం 29 సార్లు దుబాయ్‌కు ప్రయాణించినట్లు SIT పేర్కొంది. విదేశాలలో ఉంటూ హవాలా లావాదేవీలు సాగించినట్టు సిట్ అనుమానిస్తోంది.
శ్రవణ్ రావుకు లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్ కశిరెడ్డి (A1)తో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ అనుబంధంతోనే దుబాయ్ అపార్ట్‌మెంట్‌ను వినియోగించడానికి అనుమతినిచ్చినట్లు నమ్ముతున్నారు.
దుబాయ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాజ్ కాశిరెడ్డిని సిట్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి దుబాయ్ ఈ స్కాంలో కేంద్ర బిందువుగా ఎలా మారిందన్న విషయమై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.
లిక్కర్ స్కాం డబ్బుతో శ్రవణ్ రావు అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారా లేక ఆయన పాత్ర కూడా ఏమైనా ఉందా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుబాయ్ చేరిన డబ్బుతో హవాలా ద్వారా ఎవరెవరికి డబ్బు చేరిందనే దానిపై ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును తీవ్రతరం చేసింది.
లిక్కర్ స్కాం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా రూ.3,200 కోట్లు నష్టపోయినట్లు SIT ప్రాథమిక నివేదిక పేర్కొంది. ప్రసిద్ధ బ్రాండ్లను కావాలనే తప్పించి, రాజకీయంగా అనుబంధిత సంస్థల lesser-known బ్రాండ్లను ప్రోత్సహించడం ద్వారా ఈ స్కాంకి పాల్పడినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఈ కుంభకోణం ద్వారా వచ్చిన భారీ డబ్బు హవాలా మార్గాలలో దేశం వెలుపలికి తరలించినట్టు దర్యాప్తులో తేలింది. ఇందులో ప్రధాన కేంద్రంగా దుబాయ్ నిలిచిందని చెబుతున్నారు. ఈ డబ్బు ప్రయాణాన్ని పూర్తిగా గుర్తించేందుకు, విదేశీ ఆస్తుల సేకరణకు SIT, ED కలిసి పనిచేస్తున్నాయి.
లిక్కర్ స్కాంలో వచ్చిన నిధులు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడిగా మారాయని దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్ పరిసరాల్లోని ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో రాజ్ కాశిరెడ్డి సుమారు రూ.150 కోట్లకు 90 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. అందులో 60 ఎకరాలు ఇప్పటికే లాభంతో అమ్మగా, మిగిలిన 30 ఎకరాలు ఆయనకు అనుబంధ సంస్థల పేరిట ఉన్నట్లు సమాచారం.
ఈ భూ లావాదేవీలు మనీ లాండరింగ్‌కు సంబంధించినవేనా అనే కోణంలో SIT దర్యాప్తు చేస్తోంది. భూమి ఎవరినుంచి కొనుగోలు చేశాడు, ఎవరికి అమ్మాడు, అమ్మకాల ద్వారా వచ్చిన నిధులను ఎలా మళ్లించారు అనే అంశాలపై దృష్టి పెట్టారు. రాజ్ కాశిరెడ్డి, ఆయన అనుచరులు హైదరాబాద్‌లో కీలక ప్రాంతాల్లో కొనుగోలు చేసిన విలువైన ఆస్తులను కూడా గుర్తించి వాటిని పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలో అంతర్జాతీయ మనీ లాండరింగ్ కోణాలను పరిశీలించేందుకు SIT శ్రవణ్ రావును విచారణకు పిలిచింది.