ఉత్పాదకత పెంచాలని
రాష్ట్రంలోని పత్తి పంట సాగు, పత్తి నిలువ,కాలుష్యశాతం తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి వివరించినట్లు సవితమ్మ తెలిపారు. మగ్గాలు, పత్తి పంటను రక్షించడంతో పాటు ఉత్పాదకత పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు కూడా వివరించారు. జానపనార ఉత్పత్తులు, చేనేతశాఖ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర మంత్రికి వివరించినట్లు ఆమె తెలిపారు.ళ
హ్యాండ్లూమ్ క్లస్టర్ల కోసం..
అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుల అభివృద్ధికి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు రూ.35.80 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు మంత్రి సవితమ్మ చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో చేనేత కార్మికుల అభివృద్ధికి రూ.15 కోట్లు, పెనుగొండ నియోజకవర్గంలో మగ్గాల ఉపకరణాలు, వ్యక్తిగత వర్క్ షాపుల నిర్మాణానికి రూ.6.27 కోట్లు, తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామం చేనేత, హస్తకళ మ్యూజియం ఏర్పాటుకు రూ. 15 కోట్లు, అమరావతి సంస్థ ఏర్పాటుకు రూ. 280 కోట్లు, PM- MITRA కింద వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్టైల్స్ పార్కుకు ఏర్పాటు కొరకు రూ.800 కోట్లు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, మైలవరం, ఎమ్మిగనూరులలో 5 మినీ చేనేత, జౌళి క్లస్టర్ల మంజూరుకు రూ.200 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపానలు కేంద్రమంత్రి కి అందజేశారు.
ఈ ప్రతిపాదనలు పరిశీలించి, నిధుల మంజూరుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి హామీ ఇచ్చారని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమలో చేనేత ఉత్పత్తుల తయారీపై కేంద్ర మంత్రికి వివరించానని ఆమె చెప్పారు.
చేనేతకు మద్దతు ధర
చేనేతల మార్కెట్ విస్తరణకు సహకారం. ఉత్పత్తులకు న్యాయమైన ధర ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల ఆర్థికస్థితి మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్నిఆయన గుర్తు చేశారు. చేనేతల మార్కెట్ నెట్‌వర్క్ విస్తరణ, ఉత్పత్తులకు న్యాయమైన ధర నిర్ధారణ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లల విద్యావసరాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం పవర్ లూమ్స్ కంటే హ్యాండ్ లూమ్స్ కి ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలనే విషయాన్ని ఆయన అధికారులకు గుర్తు చేశారు. చిన్న సన్నచేనేత కార్మికులకు మగ్గాల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రులు పాల్గొన్నారు.