కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతున్నట్టు షర్మిల ప్రకటించారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. AICC కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భర్త అనిల్‌తో కలిసి కాసేపటి క్రితం AICC కార్యాలయానికి వచ్చిన షర్మిల..కాసేపటి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతున్నట్టు షర్మిల ప్రకటించారు. ఇవాళ్టి నుంచి YSRTP కాంగ్రెస్‌లో అంతర్భాగమన్నారు. YSRTP నేతలు, కార్యకర్తలు తనతో పాటు..కాంగ్రెస్‌లో సంతోషంగా విలీనం అయ్యారన్నారు. వైఎస్ఆర్ కుమార్తెగా కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్..తన జీవితం మొత్తం కాంగ్రెస్‌కు అంకితం చేశారన్నారు. కాంగ్రెస్‌కు సేవ చేస్తూనే వైఎస్ఆర్ చనిపోయారన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరడం వైఎస్‌ఆర్‌కు ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నది తన తండ్రి కల అని అన్నారు. తన తండ్రి కల నెరవేర్చడానికి ఎప్పుడూ కృషిచేస్తానని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కోసం చేసిన త్యాగాన్ని గుర్తించి..తనను పార్టీలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ విధేయురాలిగా ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా..నిర్వహిస్తానన్నారు. కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్నారు. రాహుల్, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజలందరికీ న్యాయం చేస్తుందని అన్నారు.