విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరిగాయో చెప్పిన మంత్రి

ఏపీ ప్రజలపై పడుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని తొలగించే దిశగా చర్చలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు.

Update: 2024-08-12 12:10 GMT

ఏపీ ప్రజలపై పడుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని తొలగించే దిశగా చర్చలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, వాటిపై దృష్టి సారిస్తామని వివరించారు. విద్యుత్ రంగంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ రంగం ఎన్నో ఆటుపోట్లు ఎదర్కొందని, విద్యుత్ ఛార్జీలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. ప్రతి ఏడాది విద్యుత్ ఛార్జీలను పెంచి వినియోగదారులపై అధిక భారం మోపిన ఘటన గత ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. వారిపై వైసీపీ ప్రభుత్వం మోపిన విద్యుత్ భారాన్ని తగ్గించేలా కూటమి సర్కార్ కసరత్తులు చేస్తుందని అన్నారు. గత ఐదేళ్లలో విద్యుత్ రంగం తీవ్ర ఇబ్బందులపాలైందని, దాన్ని తిరిగి గాడిన పెట్టడానికి అన్ని విధాల తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన వివరించారు.

ఛార్జీలు అందుకే పెరిగాయి

ఆంధ్రప్దేశ్‌లో గత ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్ రంగం కుధేలైందని, విద్యుత్ ఛార్జీల మోత కూడా మోగిపోయిందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైసీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సరిగా జరగకపోవడం వల్లే ఛార్జీలు భారీగా పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయని వెల్లడించారు. ‘‘విద్యుత్ ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు చేపడుతున్నాం. తద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. ప్రజల అవసారలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం కోసం కొత్త విద్యుత్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు కుసుమ్ యోజన్ వంటి పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాం. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.

పెరుగుతున్న వినియోగం

‘‘రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాదికి 6-7శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. పెరిగిన వినియోగానికి తగ్గట్లు ఉత్పత్తిని కూడా పెంచగలిగితే ఛార్జీలను అదుపు చేయడం సాధ్యమవుతుంది. ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. వినియోగదారులకు 24గంటలపాలు నిరవధిక విద్యుత్ సరఫరా అందించేలా ప్లాన్స్ చేస్తున్నాం. దీనికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం’’ అని వెల్లడించారు గొట్టిపాటి.

Tags:    

Similar News