తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కంటైనర్లలో తరలిపోతున్న కోట్ల కోట్లు

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. గాంబ్లర్ల నుంచి డబ్బు వస్తుందన్నారు. జగన్ ఇంటి నుంచి కంటైనర్లలో డబ్బు వస్తుందన్నారు.

Update: 2024-04-09 12:06 GMT

తెలుగుదేశం పార్టీకి అర్జంటుగా నిధులు కావాలంటూ విరాళాల వెబ్‌సైట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఈ వెబ్‌ సైట్‌ ద్వారా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు. తొలి చందాగా తానే రూ.99,999 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఎన్‌ఆర్‌ఐలకోసం వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించారు. డబ్బులు ఇచ్చిన వారికి రశీదులు ఇస్తారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందని చంద్రబాబు సూచించారు. ’పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల దగ్గర్నుంచే విరాళాలు సేకరిస్తున్నాం. వైసీపీ మాదిరిగా గ్యాంబ్లర్ల నుంచి కాదు. అందుకే ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు అనుమతించేలా వైసీపీ సమయం కోసం ఎదురు చూస్తోంది. ఎన్‌ఆర్‌ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాదు.. ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలి. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగం. వైసీపీ ఓటమిపై స్పష్టత రావడంతోనే సిట్‌ కార్యాలయంలో పత్రాలు తగులబెట్టించారు. సిద్ధం సభలకు కనీసం రూ.15 కోట్లు ఖర్చు పెట్టారు. ఏపీలో ఒక్క ఫోన్‌ ట్యాపింగ్‌ ఏంటి.. అన్ని రకాల తప్పుడు కార్యక్రమాలు జరిగాయి. ప్రతి రోజూ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కంటైనర్లలో డబ్బులు వెళ్తూనే ఉన్నాయి’ అని చంద్రబాబు చెప్పారు.

‘‘రాష్ట్ర ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో 3 పార్టీలు ముందుకు వచ్చాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. రాష్ట్రంలో ఒకే ఒక్కడు బాగుపడ్డాడు.. 5 కోట్ల మంది నష్టపోయారు. ఎన్నికల్లో ప్రచారం ఒక భాగమైతే.. ప్రలోభాలు మరో భాగం. సంపద సృష్టించడమే కాదు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి’’ అన్నారు చంద్రబాబు.


Tags:    

Similar News