ఆంధ్రలోకి ప్రవేశించిన రుతుపవనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల సంస్థ చల్లటి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ఆదివారం ప్రవేశించాయిన విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Update: 2024-06-02 15:20 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల సంస్థ చల్లటి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ఆదివారం ప్రవేశించాయిన విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని, అవి రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. దీంతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటితో జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

విస్తారంగా వర్షాలు

వీటి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాటు పడతాయని, ఇది రైతులకు శుభవార్త అని చెప్పారు. ఇందులో భాగంగానే సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఎల్లుండి అంటే మంగళవారం భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారాయన. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురవొచ్చని చెప్పారు.

ఎల్లుండి అంటే మంగళవారం.. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ప్రజలు జాగ్రత్త

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రోణంకి కూర్మనాథ్.. ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. పొలాల్లో పనిచేసే, వ్యవసాయ కూలీలు, పశు కాపరులు అందరూ కూడా చెట్లు, పోల్స్, టవర్ల కింద తలదాచుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం చేయరాదని హెచ్చరించారు. అంతేకాకుండా హైవేలపై ప్రయాణం చేసే వారు కూడా తగిన చర్యలు తీసుకోవాలని వివరించారు.

Tags:    

Similar News