రియాజ్ కోసం మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు
కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేయడంతో పోలీసులు సీరియస్
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం పొద్దుపోయాక దారుణం చోటు చేసుకుంది. పాత నేరస్తుడు రియాజ్ ను పట్టుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. చిన్న చిన్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రియాజ్ గూర్చినిజామాబాద్ సిసిఎస్ పోలీసులకు సమాచారమందింది. రియాజ్ ను పట్టుకోవడానికి ఎస్ ఐ భీంరావు, కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ బైక్ పై బయలు దేరారు. ఖిల్లా ప్రాంతంలో రియాజ్ ను అదుపులోకి తీసుకుని తమ బైక్ పై ఎక్కించుకుని కొద్ది దూరంలో బయలు దేరారు. రియాజ్ తన వద్ద ఉన్న చాకుతో ప్రమోద్ ఛాతిపై పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ప్రమోద్ ను ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ చనిపోయాడు.
ప్రమోద్ హత్యను రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. విధి నిర్వహణలో పాల్గొన్న కానిస్టేబుల్ ను హత్య చేయడం శోచనీయమని ఆయన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలో దించుతూ ఆదేశాలు జారి చేశారు. రియాజ్ మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు జిల్లాలో వెలిశాయి.