నా పేరు ఎక్కడా లేదు: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

భారత ప్రభుత్వానికి, ఏపీకి మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఇందులో మూడో వ్యక్తి ప్రస్తావన ఎక్కడ ఉంది.

Update: 2024-11-28 12:42 GMT

విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంలో అమెరికా దర్యాప్తు సంస్థ తన పేరును ఎక్కడా ప్రస్తావించ లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి మీరు అవినీతికి పాల్పడ్డారని, అమెరికా దర్యాప్తు సంస్థ పేర్కొన్నదని ఒక విలేకరి ప్రశ్నించగా.. దానికి జగన్‌ సమాధానం చెబుతూ అందులో నా పేరు ఎక్కడా లేదు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడు ఎరగరని విధంగా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు విద్యుత్‌ కొనగోళ్ల ఒప్పందం జరిగిందని, చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాల పత్రాలను మీ ముందు ఉంచానని, మీరే ఆ ఒప్పందాల్లో ఏమి జరిగిందనే దానిని నిర్ణయించాలన్నారు. రూ. 2.49లకు విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం జరగడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రానున్న 25 సంవత్సరాల్లో ఒక గొప్ప వరాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందించిందన్నారు. సంపద సృష్టించింది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడా? చంద్రబాబు నాయుడు హయాంలో సుమారు రూ. 80వేల కోట్ల భారం ప్రజలపై వేస్తే, తమ హయాంలో పైసా కూడా ప్రజలపై భారం వేయలేదన్నారు. ఈ ఒప్పందాల్లో ప్రజలపై భారం పడితే, అది ప్రభుత్వాల అసమర్థతగా ఉంటుందనే భావన జగన్‌ వ్యక్తం చేశారు.

ఇంత మంచి ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రజలకు రానున్న 25 సంవత్సరాల్లో రూ. 1.75లక్షల కోట్ల సంపదను మిగిల్చితే తనకు శాలువా కప్పి సన్మానం చేయాల్సింది పోయి ఈ విమర్శలేంటని జగన్‌ ప్రశ్నించారు.
Tags:    

Similar News