చంద్రబాబు నామినేషన్ డేట్ ఖారారు..

చంద్రబాబు ఎన్నికల నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు. కుప్పం చేరుకోనున్న భువనేశ్వరి;

Update: 2024-04-17 09:43 GMT

ఆంధ్రలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. రేపే నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల నుంచి నామినేషన్‌లను స్వీకరించనుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ పెద్దలతో మాట్లాడి ఈ నెల 19న నామినేషన్ వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే నామినేషన్‌ను చంద్రబాబు నేరుగా దాఖలు చేయడం లేదు. ఆయనకు బదులుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12:33 గంటలకు నామినేషన్ వేస్తారు. అందుకోసమే ఆమె రేపు మధ్యాహ్నమే కుప్పం చేరుకోనున్నారని సమాచారం. టీడీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆమె చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Tags:    

Similar News