Nara Lokesh Yuvagalam | లోకేష్ కి కొత్త గొంతుకను ఇచ్చిన యువగళం!

పాదయాత్ర లోకేష్ రాజకీయ పరిణతికి అద్దం పట్టింది. లక్ష్య సాధనకు బాటలు వేసింది. సూపర్ -6 మ్యానిఫెస్టోతో హామీల అమలు చేస్తున్నారని టీడీపీ చెబుతోంది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-27 10:34 GMT

యువతలో ఉత్సహం నింపడం. ప్రజల అభిమానం సాధించడం. తద్వారా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడంలోనే కాదు. రాజకీయంగా పరిణతి సాధించడానికి టీడీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ సాగించిన యువగళం పాదయాత్ర ఊతమైంది. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడంలో యువగళం పాదయాత్ర కీలకంగా నిలిచింది.

నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. ఉపకారవేతనాలు, మధ్యాహ్న భోజనం విస్తరణకు ఇచ్చిన హామీలతో విద్యార్థులను ఆకట్టుకున్నాడు. సేద్యపునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడానికి రైతుల్లో భరోసా కనిపించింది. యువతకు ఎమ్మెల్యే సీట్లు దక్కడంలో తీసుకున్న శ్రద్ధ వల్ల టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి మార్గం ఏర్పడేందుకు మంత్రి నారా లోకేష్ 3,132 కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగించిన యువగళం పాదయాత్రకు ఈ రోజు (జనవరి 27వ తేదీకి)కు రెండేళ్లు పూర్తయింది.


చిత్తూరు జిల్లా కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి 2023 జనవరి 27వ తేదీ నారా లోకేష్ సాగించిన యువగళం పాదయాత్రతో నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో పాఠాలు నేర్చుకోవడమే కాదు. గ్రామీణ వ్యవస్థను అర్థం చేసుకోవడం. ప్రజల అవసరాలను కూడా గుర్తించేందుకు అవకాశం లభించిందనడంలో సందేహం లేదు. రాజకీయ పరిశీలకులు కూడా ఇదే విషయాన్ని చెప్పడం గమనించతగిన విషయం.

యజ్ణం చేస్తున్నారని అంటున్న టీడీపీ రాష్ర్ట మీడియా సమన్వయకర్త శ్రీధరవర్మ
"నారా లోకేష్ వయసుకు మించిన సాహసం చేశారు. యువత భవిష్యత్తుకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో రాజీ పడరు. వనరులను సమీకరించడంలో చురుగ్గా ఉన్నారు" అని శ్రీధరవర్మ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు తగినట్లు ఆయన కొడుకు లోకేష్ కూడా రాష్ట్రాభివృద్ధికి ఓ యజ్ణం చేస్తున్నారు" అని ఆయన అభివర్ణించారు. "పాదయాత్ర అనేది సమాజాన్ని మరింత అధ్యయనం చేయడానికి మంత్రి నారా లోకేష్ కు ఉపయోగపడింది. "ఒదిగిన స్థితిలోనే పరిపాలనా వ్యవస్థలో మార్పులు తెస్తున్నారు" అని చెప్పిన శ్రీధరవర్మ పాఠ్యపుస్తకాలపై నాయకుల బొమ్మలు లేకుండా చేయడం. పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కూడా మధ్యాహ్న భోజన పథకం విస్తరించడాన్ని గుర్తు చేశారు. అందుకు నిదర్శనం..
హామీల్లో సూపర్ సిక్స్
యువగళం పాదయాత్ర ద్వారా సభల్లో ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అందులో కొన్నింటిని సూపర్-6 ద్వారా టీడీపీ కూటమి మ్యానిఫెస్టోలో కూడా ప్రస్తావించింది. రాష్ట్రంలో 2.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ వసతి కల్పిస్తామనేది ప్రధాన హామీ.
"టీడీపీ కూటమి ఏర్పడగానే మెగా డీఎస్సీ నిర్వహణకు తొలి ఫైలుపై సంతకం చేయడం" ఇందుకు సాక్ష్యం అని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాయలసీమ ప్రజానీకం అభివృద్ధి కోసం కడపలో "సీమ డిక్లరేషన్ ప్రకటించారు" అందులో భాగంగా పారిశ్రామికంగానే కాకుండా, నీటిపారుదల రంగానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మెగా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు కూడా చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి నెలలో వాటికి భూమి పూజ చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పెట్టుబడులు సాధించామని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు.
"రాష్ట్రంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం" పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం" అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. దేశంలో మేటి దిగ్గజాలైన ఆర్సెలర్, మిట్టల్, నిస్సాన్ స్టీల్స్, గూగుల్, టీసీఎస్, వీడియోకాన్ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
రాజకీయ పాదయాత్రలు
రాజకీయ పాదయాత్రలకు దివంగత సీఎం వైఎస్ఆర్ బాటలు వేశారు. ఆ కోవలో సీఎం చంద్రబాబు, ఆ తరువాత మాజీ సీఎం వైఎస్. జగన్ తరువాత విషాధ ఘటనల్లో కూడా సుదీర్ఘంగా పాదయాత్ర సాగించడం ద్వారా నారా లోకేష్ కూడా ఓ రికార్డు సాధించారనడంలో సందేహం లేదు. నిరాశ, నిస్పృహతో ఉన్న యువతలో కొత్త ఆశలు చిగురింప చేయడానికి రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ స్థానాల పరిథిలో ఉన్న 232 మండలాలు, మున్సిపాలిటీల్లో 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. ఓ పక్క 40 డిగ్రీల ఎండవేడిమి, కుప్పంలో యాత్ర ప్రారంభం రోజే నందమూరి తారకరత్న ఊపిరాడక కుప్పకూలడం, బెంగళూరులో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచిన విషాధ ఘటన. ప్రారంభం రోజే అపశృతి. అయినా,
"కుటుంబీకుల ప్రోత్సాహం, వారిచ్చిన ధైర్యంతోనే ముందుకు సాగుతున్నా" అని నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత తన తండ్రి సీఎం చంద్రబాబును ఆనాటి వైసీపీ అరెస్టు చేయించిన ఘటన కారణంగా కొన్ని రోజులు యాత్రకు బ్రేక్ పడినా, మళ్లీ పాదయాత్ర సాగించిన తీరుకు తగిన ఫలితం దక్కిందనేది టీడీపీ వర్గాల మాట.
మాజీ సీఎం ఎన్టీరామారావు ఓ మాట చెప్పిన మాట విమర్శకులను కూడా ఆకట్టుకుంది.
"సమాజమే దేవాలయం. ప్రజలే నా దేవుళ్లు" ఈ మాటల వెనుక ఉన్న అర్థం, పాఠం ఏమిటనేది రెండు పదాల్లో వివరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వ్యవహార సరళికి ఆ మాటలు సరిపోతాయనే సంఘటనలు కనిపించాయి. నారా లోకేష్ 70 బహిరంగసభలు, 155ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8రచ్చబండ కార్యక్రమాల ద్వారా జనంతో మమేకం అయ్యారు. వారి చెప్పింది విన్నారు. సమస్యలు ఆలకించారు. వారికి భరోసా ఇచ్చారు. ఈ పట్టణాన్ని నేనే దత్తత తీసుకుంటా. ఈ సమస్యను నేనే పరిష్కరిస్తా. అని ప్రజల అభిమానం చూరగొనడంలో సఫలం అయ్యారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా దాదాపు కోటిన్నర మందితో ఆయన నేరుగా సత్సంబంధాలు సాగించడానికి పాదయాత్ర ఉపయోగపడిందనడానికి ప్రత్యక్ష్య నిదర్శం..
"యువగళం సాగిన 97 అసెంబ్లీ స్థానాల్లో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ, మిత్రపక్ష అభ్యర్థులు 90 మంది విజయం సాధించడం" నారా లోకేష్ యువగళం పాదయాత్రకు దక్కిన ప్రతిఫలంగానే టీడీపీ వర్గాలు చెబుతున్న మాట. అందుకు ప్రధానంగా పాదయాత్రలో నారా లోకేష్ 70 బహిరంగ సభలతో పాటు 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, ఎనిమిది రచ్చబండ కార్యక్రమాల ద్వారా జనంతో కలిశారు.
ప్రతిబంధకాలు ఎదురైనా..
చిత్తూరు నుంచి తూర్పు గోదావరి జిల్లాల వరకు అడుగడుగునా ప్రతిబంధకాల మధ్యే మంత్రి నారా లోకేష్ సాగింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రచార రథం నుంచి కిందికి దిగి స్టూల్ పై నిలబడి మాట్లాడే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు ఆ స్టూల్ లాగేసేందుకు విఫలయత్నం చేశారు. అంతకుముందు కుప్పం నుంచి ఆయన బయలుదేరాక ఏకంగా 25 కేసులు నమోదైతే అందులో లోకేష్ పైనే మూడు కేసులు ఉన్నాయి. కవ్వింపు చర్యలు కూడా ఎదుర్కొన్నారు. అందులలో భీమవరం, గన్నవరం, నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో జరిగితే, 40 మంది వలంటీర్లను అరెస్ట్ చేయడమే కాకుండా, వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం ఓ ఎత్తైతే విదేశాల్లో ఉన్న వారిపై కూడా కేసులు పెట్టడం పెద్ద సంఘటన.
సీమలో...
రాయలసీమలో 124 రోజుల పాటు యువగళం పాదయాత్ర 44 అసెంబ్లీ స్థానాల మీదుగా సాగింది. ఈ పాదయాత్ర ప్రారంభం అయ్యాక మూడు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం, ఆ పార్టీ శుభసూచకంగానే కాదు. వైసీపీ పాలనకు ఇచ్చిన రెఫరెండంగా కూడా అభివర్ణించారు. ఈ ఫలితంతో అప్పటి వైసీపీ పెద్దలు కూడా ఉలికిపాటుకు గురయ్యారు.
గోదావరి జిల్లాల్లో..
ఉభయ గోదావరి జిల్లాల్లోని 17 నియోజకవర్గాల్లో 23 రోజుల పాటు సాగిన యాత్ర జనజాతరను తలపించింది. జనం మార్పు కోరుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనం అని టీడీపీ నేతలే కాదు. పరిశీలకులు కూడా ఓ అంచనాకు వచ్చారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది సెగ్మెంట్లలో 11 రోజులపాటు 225 కిలోమీటర్లు, తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది స్థానాల పరిధిలో 12 రోజుల పాటు 178 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబును కర్నూలు జిల్లా నంద్యాల వద్ద వైసీపీ ప్రభుత్వ కాలంలో అరెస్ట్ చేయించిన నేపథ్యంలో నారా లోకేష్ తన పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యమైంది. రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద నవంబర్ 27వ తేదీ తిరిగి మళ్లీ ప్రారంభమైంది. ఎన్నికలు సమీపించడంతో నారా లోకేష్ తన పాదయాత్రను కుదించి, ఇచ్ఛాపురానికి బదులు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగించారు. కానీ, నగదు పంపిణీ వ్యవహారం మళ్లీ అధికారం దక్కేలా చేస్తుందనే వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ తల్లకిందులైంది.
పరిణతికి బాటలు

నారా లోకేష్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికే పాదయాత్ర సాగలేదనే విషయం ఆయన సభల్లో వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తుంది. అప్పటి అధికార వైసీపీపై చేసిన వ్యాఖ్యలు ఉత్సాహం నింపినా, సమస్యలపై స్థిరమైన ఆలోచనలు. భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించడంలో సఫలం అయ్యారు. ప్రజలను ఆకట్టుకోవడంలో కూడా అదే స్థితి కనిపించింది. తద్వారా మాటల్లో తడబాటు. వివిధ అంశాలపై అవగాహన లేదనే విమర్శకులు కూడా "యువగళం పాదయాత్ర లోకేష్ రాజకీయ పరిణితికి మార్గం చూపింది" అనే వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలపై "సెల్ఫీ ఛాలెంజ్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, గతంలో టీడీపీ కాలంలో సాగించిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచడంలో సఫలమైనట్టు అప్పటి పరిస్థితి చెప్పకనే చెప్పింది. దీనికి తోడు భేషజాలు, దర్పం, భద్రత పక్కన ఉంచి, అభిమానులు, పార్టీ నేతలకు ప్రధానంగా యువతకు చేరువకావడానికి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలోని వైసీపీ ఎమ్మెల్యేలు సాగించిన అవినీతి, దోపిడీని ప్రజల ముందు సాక్షాలతో సహా ఉంచడంలో పార్టీకి మేలు జరిగిందనేది టీడీపీ నేతల అభిప్రాయం. వేధింపులు కేసులకు గురైన వారికి ధైర్యం చెప్పడమే కాదు. వారికి అండగా నిలవడం, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆర్థికసాయం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. "ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇక్కట్లు పడుతున్నాం. కాపాడండి" అని కోరిన వారిని ఎన్ఆర్ఐ విభాగం ద్వారా వారిని స్వదేశానికి తీసుకురావడంలో తీసుకుంటున్న శ్రద్ధ ద్వారా నారా లోకేష్ అభిమానాన్ని చూరగొన్నారు. అందుకు నిదర్శనం ఇటీవల కలికిరి, గోదావరి జిల్లాల వారిని కాపాడిన తీరే నిదర్శనం అనేది టీడీపీ నేతల మాట.
Tags:    

Similar News