వైసీపీ నుంచి మరో టాప్‌ వికెట్‌ డౌన్‌ గుడ్‌బై చెప్పిన ఎంపీ లావు

మొన్న కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌.. నిన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఇవాళ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. రేపు ఎవరు?;

Update: 2024-01-23 05:42 GMT
MP LAVU KRISHNADEVA ROYALU

మొన్న కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌.. నిన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఇవాళ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. రేపు ఎవరు? వైసీపీకి గుడ్‌ బై చెబుతున్న ఎంపీల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పార్టీలో ఉంటూనే తిరుగుబాటు ఎంపీగా మారి వైసీపీకి తలనొప్పిగా మారారు. మరోపక్క, ఎంపీ సీట్లు మార్చిన వారు కూడా పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. వారిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రి గుమ్మన జయరామ్ పేరు వినిపిస్తోంది. మొత్తం మీద ఏపీలో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి.

కృష్ణదేవరాయలు సంచలన నిర్ణయం...


పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా అనిశ్చితి నెలకొందని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గత బుధవారం శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీలో చేరికపై ఇప్పటికే ఆయన బాబుతో చర్చించారు. నరసరావుపేట ఎంపీ టికెట్‌పై హామీ లభించకపోవడంతో కొంతకాలంగా ఆయన వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ వీడతారని కొన్ని రోజల నుంచి ప్రచారం జరుగుతోంది. ఊహించినట్టుగానే పార్టీకి, ఎంపీ పదవికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడైన లావు శ్రీకృష్ణదేవరాయలు..తండ్రి బాటలో రాజకీయాల్లో ప్రవేశించారు. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి ఎంపీగా గెలుపొందారు.

టీడీపీ వైపే చూపు...

ఏపీలో ఎన్నికల ముందు... రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే టీడీపీ అధినేత చంద్రబాబుతో లావు శ్రీకృష్ణ దేవరాయలు సమావేశమయ్యారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో చంద్రబాబును శ్రీకృష్ణ దేవరాయలు కలిశారు. గుంటూరు జిల్లా రాజకీయ పరిణామాలపై గంటన్నర పాటు చర్చించారు. దీంతో ఆయన టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

చంద్రబాబుతో కృష్మదేవరాయలు భేటీ

చంద్రబాబుతో గుంటూరు జిల్లా రాజకీయాలపై దేవరాయలు చర్చించారు. గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాల్లో.. ఏదైనా పర్వాలేదని ఆప్షన్‌ శ్రీకృష్ణదేవరాయలకే చంద్రబాబు వదిలేశారు. అయితే చంద్రబాబుతో శ్రీకృష్ణ దేవరాయలు సమావేశం కావడంతో.. పలువురు టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. గుంటూరు, నరసరావుపేట ఎంపీ సీట్లపై పలువురు ఎన్నారైలు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు నరసరావుపేట సీటుపై.. లావు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలతో పాటు MLC జంగా కృష్ణమూర్తి.. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్‌ రావు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కుటుంబసభ్యులు, అనుచరులతో మాట్లాడి శ్రీకృష్ణదేవరాయలు త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News