ఉగాది వేడుకల్లో పవన్.. గృహ ప్రవేశం కూడా..

ఉగాది సంబరాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన పంచాంగ శ్రవణం కూడా నిర్వహించారు.

Update: 2024-04-09 08:22 GMT
Source: Twitter


జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గృహ ప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుసుకున్నారు. గొల్లప్రోలు బైపాస్‌లోని పార్టీ కార్యకర్త భవనంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు పవన్ కల్యాణ్.


పవన్‌కు 50 వేల మెజార్టీ పక్కా

పవన్‌కు శని ప్రభావం తగ్గి గురు బలం పెరుగుతుందని పండితులు చెప్పారు. ‘‘పవన్‌కు గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయి. ఆయనకు కాలం అద్భుతంగా కలిసి రానుంది. ఈ క్రమంలో ఆయన కేంద్రమంత్రి అయినా ఆశ్చర్చపోవాల్సిన అవసరం లేదు. ఆయన కొత్త ఇంట్లో సుఖసంతోషాలతో ఉంటారు. పవన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. 50వేల మెజార్టీతో పవన్ విజయం సాధిస్తారు. భవిష్యత్తులో పవన్‌కు రాజయోగం రానుంది’’అని వివరించారు పండితులు.



రైతులు క్షేమంగా ఉండాలి


ఉగాది వేడుకల సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘‘ఉద్యోగులకు ప్రతి నెలా సమయానికి జీతాలు రావాలి. రైతులు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరగాలి. పండించిన పంటకు మంచి ధర లభించాలి. ఆంధ్రలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం నాకుంది. రానున్న ఎన్నికల్లో అమ్మవారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం వస్తుంది’’అని చెప్పారు.



Tags:    

Similar News