‘అలా చేస్తే ఊరుకునేది లేదు’.. జనసైనికులకు పవన్ కల్యాణ్ వార్నింగ్..

జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించకుండా షోకాజ్ నోటీసులు తప్పనిసరి అని హెచ్చరించారు. పల్లా శ్రీనివాస్‌తో భేటీ తర్వాత పవన్ ఈ ప్రకటన చేశారు.

Update: 2024-07-08 07:36 GMT

జనసైనికులకు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక హెచ్చరికలు చేశారు. ప్రభుత్వాన్ని, అధికారులపై అనవసరమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయిన హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, అధికారుల పనితీరును బలహీనపరిచేలా నిరాధార ఆరోపణలు చేసిన ఉపేక్షించేది లేదని చెప్పారు. దాంత పాటుగా పార్టీ నేతలు, కార్యకర్తులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని, అలా చేయొద్దని కూడా వివరించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే వారికి షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పారు. ఒకవేళ వారి నుంచి సంతృప్తికర సమాధానం రాకుండా చర్యలు తప్పక ఉంటాయని, పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన ప్రకటించారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి క్షీణదశకు చేరి ఉంది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ దుర్బరస్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని చేపట్టిన ఎన్‌డీఏ ప్రభుత్వం అన్నింటినీ తిరిగి గాడిలో పెట్టడానికి శాయశక్తులా శ్రమిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రభుత్వానికి బాసటగా నిలవాలే తప్ప బంధనాలు కాకూడదని వివరించారు. అన్ని నిబంధనలను జనసేన పార్టీ కార్యకర్తలందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.

ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయంతో పాటు, రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పనులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి విషయాలపై చర్చించారు. పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయాన్ని నేతలు పర్యవేక్షించాలని, ఎక్కడైనా భేదాభిప్రాయాలు తలెత్తున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్, పల్లా శ్రీనివాస్ నిర్ణయించారు. అంతేకాకుండా కార్యకర్తల సహాయంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని, వాటితో పాటు వాటిని సరిదిద్దడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ప్రజలకు తెలపాలని వారు చర్చించుకున్నారు.

Tags:    

Similar News