సీఎం జగన్‌పై దాడి చేసిన నిందుతుడు అరెస్ట్..

సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచారు.

Update: 2024-04-18 12:07 GMT

వైసీపీ అధినేత, రాష్ట్ర సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఇటీవల జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా సీఎంపైకి రాయి విసిరిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజే అతడిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ అంశంపై కోర్టు విచారణ అనంతరం సదరు అనుమానితుడిని పోలీసు కస్టడీకి తరలించనున్నట్లు సమాచారం.

అనుమానితుడి వివరాలు

సీఎం జగన్‌పై దాడి చేసిన వ్యక్తిని సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌గా గుర్తు చేశారు. అతడిని ఈ కేసులో ఏ1 గుర్తించామని విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీసులు తెలిపారు. సీఎం జగన్‌పై రాయి విసిరింది అతడేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తుల తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించామని, అనంతరం అక్కడి నుంచి అనుమానితుడిని కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు వివరించారు.

Tags:    

Similar News