నాగరికతను ప్రశ్నిస్తున్న అత్యాచారాలు: పీసీవీ

దేశంలో పెరుగుతున్న అత్యాచారాలు-హత్యలకు వ్యతిరేకంగా పౌరచైతన్య వేదిక వారు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఘటనలు మన నాగరికతను ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు.

Update: 2024-08-22 13:02 GMT

మానవ నాగరికతనే ప్రశ్నిస్తున్న మహిళలపై చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు - హత్యలు అంశంపై ఎస్వీ యునివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో 24వ తేదీన (శనివారం) జరుగుతున్న సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఈ రోజు ఉదయం వామన రావు భవన్ వద్ద పిసివి అధ్యక్ష, కార్యదర్శులు వాకా ప్రసాద్, ఏ.ఎన్.పరమేశ్వర రావు ఆవిష్కరించారు.

ఈ సదస్సుకు తిరుపతిలోని పౌర సమాజమంతా హాజరై ఈ రోజు మహిళలు, పసిపిల్లల మీద అమ్మాయిలు మీద జరుగుతున్న అత్యాచారాలు-హత్యలకు కారణమైన అంశాలు, ప్రభుత్వాలు చెప్పట్టాల్సిన చర్యలపై చర్చించాలని కోరారు. మానవ సమాజంలో నీతి, నైతికత, విలువలు, సంస్కృతి అనేవి రోజురోజుకీ పతనం అవుతున్నాయని, దానికి పసిపిల్లల నుండి మొదలుకొని అరవై , డెబ్బై ఏళ్ల మహిళలు, అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు-హత్యలే నిదర్శనం అని అన్నారు.

కలకత్తలో జరిగిన ఆర్జి కర్ సంఘటలో నిందితులను, వారి వెనకాల ఉన్న ముఠాను పసిగట్టి, శిక్షించకుండా పోలీసులు, కోర్టులు, ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని అన్నారు. ఇటువంటి సంఘటనలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర చైతన్య వేదిక జిల్లా కోశాధికారి ఏ.హరీష్, కమిటి సభ్యులు ఎల్.ఎన్ లక్ష్మి మరియు విద్యార్థి సంఘం నాయకులు ఎన్.నవీన్, టి.మహేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News