ప్రకాశం బ్యారేజీ బోట్లను ఇలా లాగుతున్నారు

వరద ప్రవాహానికి బ్యారేజీకి కొట్టొకొచ్చిన బోట్లను తొలగించే ప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది.

Update: 2024-09-15 08:57 GMT

ఇటీవల వరద ప్రవాహానికి కొట్టొకొచ్చిన బోట్లను తొలగింపు ప్రకియ నేటికీ కొనసాగుతూనే ఉంది. రెండు ప్రత్యేక నిపుణుల బృందాలను రంగంలోకి దింపినా ఇంత వరకు కొలిక్కి రాలేదు. వైజాగ్‌ నుంచి డైవింగ్‌ టీమ్‌ను, కాకినాడ నుంచి అబ్బులు బృందాలను విజయవాడకు రప్పించారు.

Delete Edit

రెండు బృందాల నేతృత్వంలో పడవలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు నుంచి వెనక్కు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రోప్‌లు కట్టి లాగే ప్రయత్నాలు కొంత మేరకు ఫలితాన్నిచ్చింది. దాదాపు 20 మీటర్ల వరకు కదిలింది. ఇక ఒడ్డుకు లాగేయొచ్చు అని అనుకుంటుండగానే మళ్లా అది వెనక్కు వెళ్లి పోయింది. ఒక పడవను లాగేస్తే అదే పద్దతిలో తక్కిన మూడు పడవలను కూడా లాగేయొచ్చని భావించారు. అయితే కొంత దూరం వచ్చి తిరిగి వెనక్కు వెళ్లి పోవడంతో పరిస్థితి యధాస్థితికి చేరుకుంది. ఆదివారం తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. డైవింగ్‌ టీమ్‌కు చెందిన 10 మంది, అబ్బులు బృందానికి చెందిన 16 మంది కలిసి పని చేస్తున్నారు.

Delete Edit

ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న పడవకు రోప్‌ను కట్టి ప్రొక్లెయిన్‌తో లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా ఫలితం కనిపించక పోవడంతో పెద్ద పడవలకు కూడా రోప్‌ను కట్టి, అటు ప్రొక్లెయిన్‌ సహాయంతోను, ఇటు పెద్ద పడవల సహాయంతో ఒకే సారి లాగాలని ప్లాన్‌ చేస్తున్నారు. అదీ వర్క్‌వుట్‌ కాకపోతే అటు బ్యారేజీ వద్ద ఉన్న నాలుగు పడవలకు కూడా ఐరన్‌ రోప్‌లను కట్టి ఇటు పెద్ద పడవలకు, ప్రొక్లేన్‌కు లింకప్‌ చేసి ఒకే సారి లాగాలని భావిస్తున్నారు. ఇలా ఒకే సారి లాగడం వల్ల ఇరుక్కొని పోయిన పడవలన్నీ ఒకే సారి కదిలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Delete Edit

ఇలాంటి రిస్యూ్క ఆపరేషన్‌లు ఎప్పుడూ చేపట్ట లేదని ఇదే తొలి సారని డైవింగ్‌ టీమ్‌కు చెందిన అక్షిత్‌ తెలిపారు. సముద్రాల్లో ఇలా ప్రమాదంలో చిక్కుకొని పోయిన పడవలను ఎన్నో సార్లు బయటకు తీసుకొచ్చామని అబ్బులు బృందానికి చెందిన ఒక సభ్యుడు తెలిపారు. అయితే ఇక్కడ లోతు తక్కువుగా ఉండటంతో బయటకు తెచ్చేందుకు ఇబ్బందిగా ఉందని, దీనికి తోడు అడుగు భాగంలో ఇసుక, రాళ్లు వంటివి కొట్టొకొని వచ్చి అడ్డంగా పేరొకొని పోవడంతో పాటుగా బోట్లన్నీ లంకెపడి పోయాయని దీంతో పడవ ఇరుకొని పోయిందని, దాదాపు 50 టన్నులకుపైగా బరువు ఉన్న పడవలు లంకెపడిపోయి ఉండటంతో వాటిని లాగేందుకు సమయం పడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు అనేది ఎప్పటికీ పూర్తి అవుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోజు ఆదివారం సెలవు కావడంతోప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చిన పడవలను, వాటి తొలగింపు ప్రక్రియను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Tags:    

Similar News